Skip to main content

Posts

Showing posts from 2020
 రైతు పండించే పంటకి క్రయ, విక్రయ  లెక్కలు అడుగుతుంది మోడీ గారి ప్రభుత్వం, ఎందుకంటె? 1) రైతు పెట్టుబడు ఎంత పెడుతున్నాడు, దానికి ప్రతిఫలం ఎంతవస్తుంది. లాభం వస్తే పర్వాలేదు, కానీ నష్టాలు వస్తుంటే దానికి తగ్గ సాయం అందించే కార్యక్రమం చేపట్టడానికి. ఇప్పటి వరకు ఒక లెక్క పత్రం లేని జీవితం రైతుది.  2) రైతుల దగ్గర, దళారీలు తక్కువ ధరకి సరుకు కొని విఫణిలో మూడింతలుకి అమ్మి, ఆ వచ్చిన లాభం లెక్క దళారీలు ప్రభుత్వానికి చెప్పకుండా బ్లాక్ మనీ  కూడబెట్టకుండా ఆపడానికి.  3) బ్లాక్ మనీ కూడబెట్టిన ఇలాంటి దళారీలు, ఈ అక్రమ డబ్బుని మళ్ళీ ఎలేక్షన్  లో పెట్టుబడి గా పెట్టి, ప్రభుత్వాలని శాశించేవాళ్ళని ఆపడం .  ఇప్పుడు చెప్పండి రైతులారా, పోరాటం చేసి బిక్షం తీసుకొందామా? లేక ఇంకా గట్టి చట్టాలు తీసుకొచ్చి దళారీల పని పడదామా? ఇప్పుడు చెప్పండి భయ్యా, జై మోడీజీ అని . ఇంకొక మూడు సార్లు మోడీ గారు వస్తేనే మనము ఈ పాచిపోయిన పోరాటాలు నుండి బయటకి వస్తాము.   జై హింద్, శరభయ్య పోలకం 

Leader for better tomorrow and better society

యుగాలుగా కులము అని, ప్రాంతము అని విచ్చిన్నమైన తెలుగు జాతికి ఒక దివ్వె దీక్చూచి దిశా నిర్ధేశం చేస్తుంది. రండి మనం తెలుగు నుడికారాన్ని మళ్ళీ వినిపిద్దాము.  ఆంధ్రుల ఐఖ్యత మనం జన సేనానికి ఇచ్చే జన్మదిన కానుక. తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే. ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్ శరభయ్య పోలకం 

ఆత్మ నిర్భర భారత్ కి, నేను సైతం

మనకు వచ్చే అనేక వ్యాధులకు కారణం మన జీర్ణ వ్యవస్థ అని మీకు తెలుసా? జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచడం మన చేతుల్లోనే వుంది. మన ఇంటిలోనే లాక్టోబాసిల్లస్ (పునీళ్లు) తయారు చేసుకోవచ్చు. మన తాతలు తండ్రులు చేసినదే. నేను పాటించిన తయారీ విధానం: 1) బియ్యం కడిగిన నీళ్లు ఒక గిద్ద తీసుకొని ఒక నైట్ కిచెన్ టాప్ మీద పెట్టండి. 2) రెండు లీటర్ల పాలు ఒక సీసా లో తీసుకొని, దానిలో బియ్యం నీళ్లు కలపండి. 3) మూడు రోజుల తరువాత పైన తేలిన మీగడ వడగట్టి, వచ్చిన నీళ్ళని స్టోర్ చేసుకొని, భోజనానికి ముందు ఒక అర గ్లాస్ తీసుకోండి. 4) మీకు హుషారుగా అనిపిస్తే మీ చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యండి. జై హింద్ శరభయ్య పోలకం      

మళ్ళీ తిరిగి విశ్వాసాన్ని కోరమంటాన్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనిలో అతిశయోక్తి ఏముంది?

క్రిష్ణా, గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు రాజానామా చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చెయ్యడంలో నాకు తప్పు ఏమి కనబడటం లేదు. ఆ రోజు అన్ని పార్టీలు కలసి ఏకాభిప్రాయంతో అమరావతిని  రాజధానిగా నిర్ణయించినప్పుడు, ఆ రెండు జిల్లాల రైతులు సంతోషముగా వారి పొలాలను డెవలప్మెంట్ కోసం ప్రభుత్వానికి త్యాగం చేశారు. ఆ తరువాత చంద్రబాబు కేంద్రంతో గొడవపడి డెవలప్మెంట్ ని ప్రక్కకు పెట్టి ప్రజల ఆస్తులను దోచుకోవడం మీద ద్రుష్టి పెట్టడంతో ప్రజల విశ్వాసాన్ని కోలుపోయారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రజలు జగన్ కి ప్రభుత్వ పగ్గాలు అందిస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అని ఆశించి వైసీపీ కి ఓట్లు వేసి వారి అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యులు అయ్యారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేయకపోగా, అసలుకే మోసం తెస్తే మరి సొల్యూషన్ ఏమిటి? మళ్ళీ తిరిగి విశ్వాసాన్ని కోరమంటాన్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనిలో అతిశయోక్తి ఏముంది? రాజీనామాలు చేసి మల్లి ఎన్నికలకి వెళ్ళండి. మూడు రాజధానుల అంశం మీదనే ఓట్లు అడగండి. గెలిస్తే మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యండి, లేకపోతే యధాస్థితి కొనసాగించండి. రాజానామాలు చెయ్యడం...

ఇదెక్కడి రాజ్యం? ఇది రామ రాజ్యమా?

ఇదెక్కడి రాజ్యం? ఇది రామ రాజ్యమా? గ్యాస్ లీక్ అయ్యి ప్రజలు ప్రాణాలు పోతే కోటి. మృగాలు ఆడపడుచుల మానాలు చెరిస్తే కోటి. అదేమిటని ప్రశ్నించే వారి నోరు మూయించడానికి పైడ్ ఆర్టిస్టులకి ఇంకొక కోటి. వీటన్నింటిని చూసి ఓట్లు వెయ్యరని పప్పుబెల్లాలకి కోట్లు. మీరు తక్షణ సహాయం కోసం కోట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ మళ్ళీ ఇలాంటి గ్యాస్ లీకులు కాకుండా నివారణ చర్యలు తీసుకోవడం మీ తక్షణ కర్తవ్యం కాదంటారా పాలకులారా? మీరు తక్షణ సహాయం కోసం కోట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ మళ్ళీ ఆడపడుచుల మాన రక్షణ మీ తక్షణ కర్తవ్యం కాదంటారా పాలకులారా? మీరు తక్షణ సహాయం కోసం కోట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ మళ్ళీ సగటు ఓటరుని చిల్లరకి లొంగి పోకుండా నిర్భయంగా ఓటు సక్రమంగా వినియోగించుకొనే లాగా అభివృద్ధి పదంలో నడిపించడం  మీ తక్షణ కర్తవ్యం కాదంటారా పాలకులారా? ప్రజల ధనంతో, ప్రజల కోసం నియమించిన ప్రభుత్వ అధికారులను మీ కార్యకర్తలకు పాదాక్రాంతం చెయ్యడం అరాచకం కదా?  కాదంటారా పాలకులారా? జై హింద్, శరభయ్య పోలకం

పవన్ కళ్యాణ్ గారి చాతుర్మాస దీక్ష

నాలో శివుడు, నాలో బ్రాహ్మ, నాలో విష్ణువు, నాలో కృష్ణ వున్నప్పుడు భూమి, ఆకాశం,  పర్వతం, సముద్రం ఎక్కడ చూసినా భగవదర్శనమ్ కలుగుతున్నప్పుడు ఏందుకు మందిరానికి వెళ్లడం.  ఈ సృష్టి అతని స్వప్నం, ఇక్కడ వున్న ప్రతి వ్యక్తి ఆతని సొంతవాళ్ళే అయినప్పుడు భగవంతుని కృప సాధనకు, ప్రతి వ్యక్తికి ప్రేమను పంచడము కన్నా ఉన్నత మార్గం ఏముంటుంది? నా ప్రతి శ్వాస, లయ ఎదుటి వ్యక్తికి పేమని ఇస్తున్నప్పుడు నేనెందుకు మందిరానికి వెళ్లడం. నాలో భగవంతుడు వున్నాడు. పవన్ కళ్యాణ్ గారి చాతుర్మాస దీక్ష గురించి వినగానే, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన కిస్నా సినిమాలో ఒక పాట గుర్తుకు వచ్చింది. తెలుగులో తర్జుమా చేస్తే బాగుంటుంది అనిపించింది.  నేను పవన్ కళ్యాణ్ గారిని అనుసరించడం గర్వంగా భావిస్తున్నాను. నా మిడిమిడి హిందీ భాషా ప్రావీణ్యం చెయ్యలేని ఈ హిందీ నుండి తెలుగు లోకి తర్జుమాని నాకోసం చేసిన నా భార్యకి మనఃపూర్వక ధన్యవాదములు.   జై హింద్, శరభయ్య పోలకం
సజ్జనుడైన వ్యక్తి నడవడిక కీర్తింపబడుతుంది మరియు అనుసరించబడుతుంది. అలాగే దృష్టుల వాక్కులు నిశిత పరిశీలనకు లోను కాబడతాయి. సజ్జనుడైన పవన్ కళ్యాణ్ గారు ఒక్క అడుగుకి దృష్టుల కూసాలు కదిలి ప్రకంపనలు కలిగి అసత్యాల ఆసరాగా నిలబడి తలఎత్తుకోవాలని తాపత్రయం పడుతున్నారు. విజ్ఞులైన ప్రజానీకం ఇదంతా గమనిస్తుంది. సమయం సమాధానం తయారుచేసుకొంటుంది. సరిఐన సందర్భములో అది ప్రస్ఫుటమవుతుంది. జైహింద్ శరభయ్య పోలకం 
పేదలకి ఇళ్ల స్థలాలు పంపకం మంచి పనే. కానీ స్థలం అప్పు తీసుకురాలేము కదా? అలాగని, మంచి పని కోసం రైతులు ఇచ్చిన భూములని పంచే బదులుగా, తెల్లచొక్కాలు భోంచేసిన భూములను కక్కించవచ్చునేమో? గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు ఆలోచిస్తే మంచిదేమో? మీరే ఆలోచించండి?   జై హింద్ శరభయ్య పోలకం 

సెక్షన్ 230 సవరింపు,

వీధిలో మైక్ పెట్టి, త్రాగుబోతులతో బాండ బూతులు తిట్టిస్తే, అది ఎవరి తప్పు? మైక్ పెట్టిన వారిదా? బూత్లు తిట్టిన త్రాగుబోతుదా? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు  కరెక్ట్ గా ఇలాగే ప్రశ్నించాడు. జవాబు, సెక్షన్ 230 సవరింపు. ఇకనుండి అభ్యంతరకరమైన లేక దేశ వ్యతిరేకమైన అభిప్రాయాలని పోస్ట్ చేసిన వారు మరియు పబ్లిష్ చేసిన వారు ఇద్దరు న్యాయ పరమైన చర్యలను ఎదుర్కొంటారు. పోస్ట్ పెట్టే వారి అభిప్రాయాలకి మీడియా లేక సోషల్ మీడియా బాధ్యులు కాదు అనే desclaimer ఇక పనిచేయదు. కచ్చితం గా ఇప్పుడు చెయ్యవలసిన చట్టమే ఇది. అదృష్టవశాత్తు ఇది అన్ని సోషల్ మీడియా సంస్థలకి వర్తిస్తుంది. ఇక పెటియం రంగుల పార్టీలకి మరియు వారి వారి మీడియా సంస్థలకి రంగులు పడటం ఖాయం. మనము ఇక నుండి నిరభ్యంతరంగా సకుటుంభసపరివారం గా సోషల్ మీడియా ఓపెన్ చెయ్యొచ్చు, మరియు టీవీ చానెల్స్ చూడవచ్చు. మన ప్రధాని మోడీ గారు కూడా ఇలాంటి పరిస్కారం కొరకు చూస్తున్నారని తెలుసు. పరిస్కారం దొరికినట్లే కదా? జై హింద్, శరభయ్య పోలకం 
ఒక తరము గతిలేక అమెరికా కి తరలి వెలసి వెళ్ళింది. ఇప్పుడు పాలకులు పని కట్టుకొని ఇంగ్లీష్ నేర్పించి ఇంకొక తరాన్ని బానిసలుగా చేసి అమెరికాకి పంపించాలని చట్టాలు చేస్తున్నారు. ఆనాడు రాజధాని కోసం తూతూ మంత్రం ప్రజాభిప్రాయానికి, ఇప్పటి ఇంగ్లీష్ మీడియం ప్రజాభిప్రాయానికి తేడా ఏమి వుంది. ఇలాంటి బయాస్డ్ ప్రజాభిప్రాయం ప్రజలకి మేలు చెయ్యడానికేనా లేక ప్రభువులు అనుకొన్నది ప్రజల మీద రుద్దడానికా? టీడీపీ Vs వైసీపీ,   జన్మభూమి కమిటీ  Vs గ్రామీణ సచివాలయం, రాజధాని కోసం ప్రజాభిప్రాయానికి Vs ఇంగ్లీష్ కోసం ప్రజాభిప్రాయానికి మీకు తేడా ఏమైనా తెలుస్తుందా? దొందు దొందేన ?   జైహింద్ శరభయ్య పోలకం 

వలస కార్మికులు, మనం తల వంచుకోవాల్సిన విషయం కాదా?

వలస కార్మికులు దేశంలో ఇంకా వున్నారు అంటే, అది మనం సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం కాదా? భారత్ వెలిగి పోతుంటే మరి ఈ వలసలు ఏమిటి? కరోనా వలన ఇంత మంది పరాయి పంచన బతుకు ఈడుస్తున్నారనే సత్యం వెలుగు చూసింది. మరి తెలిసి మనం చేస్తున్నది ఏమిటి? నారద పాత్ర పోషిస్తున్న మీడియా ఇలాంటి వాటిని వెలుగు లోకి తెచ్చి, ఇంటెలెక్చవల్స్ తో డిబేట్స్ ఎందుకు పెట్టవు? ఎంత సేపు, నేను నా పార్టీలు పదవిలోకి రావాలి, ప్రభుత్వ సొమ్ముని జుఱ్ఱు కోవాలి అన్న యావ తప్ప, భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరు గౌరవప్రదమైన జీవితం సాగించాలని దానికి కావలసిన ప్లానింగ్ చెయ్యాలని మన నాయకులు అని అనుకొంటున్న వాళ్ళు ఎందుకు అనుకోవడములేదు.  చల్లకొచ్చినమ్మ ఎంతకాలం ముంత దాస్తుంది? మేము బాగానే వున్నాము అని దాగుడుమూతలు ఎంతకాలం? పప్పు బెల్లాలు పంచి నోరు తీపిచేసాములే అని దాటవేత ధోరణితో పాలన సాగించడము ఈనాటి మేటి నాయకులకే చెల్లింది. నేను బాగా లేక పోయినా పర్లేదు, రేపటి తరం కోసం పునాది వేస్తున్నా అని చెప్పిన పుస్తకాలలో చదివిన తాత ఏమిటి అంజనం వేసి చూసినా సెంటర్ లో కనబడటం లేదు? వీరిది ఏ కులం? ఏ మతం? కొంచెం చెబితే మన నాయకుల నుండి మరియు వారి వెనక...