క్రిష్ణా, గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు రాజానామా చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చెయ్యడంలో నాకు తప్పు ఏమి కనబడటం లేదు. ఆ రోజు అన్ని పార్టీలు కలసి ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు, ఆ రెండు జిల్లాల రైతులు సంతోషముగా వారి పొలాలను డెవలప్మెంట్ కోసం ప్రభుత్వానికి త్యాగం చేశారు. ఆ తరువాత చంద్రబాబు కేంద్రంతో గొడవపడి డెవలప్మెంట్ ని ప్రక్కకు పెట్టి ప్రజల ఆస్తులను దోచుకోవడం మీద ద్రుష్టి పెట్టడంతో ప్రజల విశ్వాసాన్ని కోలుపోయారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రజలు జగన్ కి ప్రభుత్వ పగ్గాలు అందిస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అని ఆశించి వైసీపీ కి ఓట్లు వేసి వారి అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యులు అయ్యారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేయకపోగా, అసలుకే మోసం తెస్తే మరి సొల్యూషన్ ఏమిటి? మళ్ళీ తిరిగి విశ్వాసాన్ని కోరమంటాన్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనిలో అతిశయోక్తి ఏముంది? రాజీనామాలు చేసి మల్లి ఎన్నికలకి వెళ్ళండి. మూడు రాజధానుల అంశం మీదనే ఓట్లు అడగండి. గెలిస్తే మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యండి, లేకపోతే యధాస్థితి కొనసాగించండి.
రాజానామాలు చెయ్యడం ఇష్టం లేకపోతే, మిగిలిన మూడు ఏండ్లు అమరావతిలో కొరవ పనులు చెయ్యండి. 2024 ఎన్నికలలో మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు మల్లి గెలిచినప్పుడు మూడు రాజధానులను ఏర్పాటు చెయ్యండి. మీకు అప్పుడు అడ్డు ఎవరు అధ్యక్షా ?
జై హింద్,
శరభయ్య పోలకం
Comments
Post a Comment