Skip to main content

Leader for better tomorrow and better society

యుగాలుగా కులము అని, ప్రాంతము అని విచ్చిన్నమైన తెలుగు జాతికి ఒక దివ్వె దీక్చూచి దిశా నిర్ధేశం చేస్తుంది. రండి మనం తెలుగు నుడికారాన్ని మళ్ళీ వినిపిద్దాము.  ఆంధ్రుల ఐఖ్యత మనం జన సేనానికి ఇచ్చే జన్మదిన కానుక.

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే, మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే. ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు.

జై హింద్, జై భారత్
శరభయ్య పోలకం 

Comments

Popular posts from this blog

 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం   
బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...

ట్రస్ట్ తన పని తాను చేసుకుపోతుంది...

1) చిన్నగంజాం మండల ప్రజలు కరెంటు బిల్ కట్టడానికి ట్రస్ట్ వారు ఆన్ లైన్ సౌకర్యము ఉచితముగా కల్పించుచున్నారు. ప్రజలు చిన్నగంజాం మండల కార్యాలయము ఆవరణయందు గల ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు. 2) చిన్నగంజాం మండలం జీడిచెట్లవారి పాలెంలో వున్న చిన్నారులు మరియు మహిళలు స్వయం ఉపాధికోసం కుట్టు  మెషిన్ స్కిల్ నేర్పించడాని ట్రస్ట్ సభ్యులు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఔత్సహికులైన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్సియల్ ఇండిపెండన్స్ సాదించాలని మనఃపూర్వకముగా కోరుకొంటున్నాను. 3) చిన్నగంజాం మండలం కాటమవారి పాలెం సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మరమత్తులు జరుగుతున్నవి. సామాజిక స్పృహ వున్న సహృదయులు ఈ పనులలో వాలంటీర్ గా పాల్గొని సమాజ సేవకి పునరంకితము కాగలరని ఆశిస్తున్నాను. సమాజ సేవకి అంకితమయిన మనకు  ఏ అడ్డంకులు లేకుండా అన్ని విధాలా సాయపడుతున్న మండల ప్రజలకి మరియు మనకు సమాజ సేవాగుణాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి సదా భక్తుడినై  ఉంటానని నాకు నేను మరల చెప్పుకుంటున్నాను. జై హింద్ శరభయ్య పోలకం