ఇదెక్కడి రాజ్యం? ఇది రామ రాజ్యమా? గ్యాస్ లీక్ అయ్యి ప్రజలు ప్రాణాలు పోతే కోటి. మృగాలు ఆడపడుచుల మానాలు చెరిస్తే కోటి. అదేమిటని ప్రశ్నించే వారి నోరు మూయించడానికి పైడ్ ఆర్టిస్టులకి ఇంకొక కోటి. వీటన్నింటిని చూసి ఓట్లు వెయ్యరని పప్పుబెల్లాలకి కోట్లు.
మీరు తక్షణ సహాయం కోసం కోట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ మళ్ళీ ఇలాంటి గ్యాస్ లీకులు కాకుండా నివారణ చర్యలు తీసుకోవడం మీ తక్షణ కర్తవ్యం కాదంటారా పాలకులారా? మీరు తక్షణ సహాయం కోసం కోట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ మళ్ళీ ఆడపడుచుల మాన రక్షణ మీ తక్షణ కర్తవ్యం కాదంటారా పాలకులారా?
మీరు తక్షణ సహాయం కోసం కోట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ మళ్ళీ సగటు ఓటరుని చిల్లరకి లొంగి పోకుండా నిర్భయంగా ఓటు సక్రమంగా వినియోగించుకొనే లాగా అభివృద్ధి పదంలో నడిపించడం మీ తక్షణ కర్తవ్యం కాదంటారా పాలకులారా? ప్రజల ధనంతో, ప్రజల కోసం నియమించిన ప్రభుత్వ అధికారులను మీ కార్యకర్తలకు పాదాక్రాంతం చెయ్యడం అరాచకం కదా? కాదంటారా పాలకులారా?
జై హింద్,
శరభయ్య పోలకం

Comments
Post a Comment