మన చిన్నగంజాం మండలం అనాదిగా నిర్లక్ష్యానికి గురిఅయిందనేది నిష్ఠూర సత్యం. కుల ప్రాతిపదికన ప్రజలను ముక్కలుగా విడదీసి, ఓట్లు సంపాదించుకొనే శ్రద్ధ ఆశక్తులు, మండల అభివృద్ధి మీద చూపించక పోవడము చోచనీయం. గ్రామాలలో ఒక విధమైన నిర్జీవ వాతావరణం కనబడుతుంది. స్వీయ నియంత్రణ తో స్వయంగా అభివృద్ధి సాధించడానికి సాయం అందించడము లో కూడా ఎన్నికలలో గెలిచిన నాయకులు ముఖం చాటు వేయడముతో, ప్రజలు విసిగి వేసారి పోయారు. మేము చేసిన పాపం ఏమిటి అని కుములి పోతున్నారు.
ఇది అనాది గా మనము చూస్తున్నదే, కాని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? మనల్ని మనం అడగవలసిన ప్రశ్న ఇది.
1) గెలిచిన నాయకులకి కనీస విషయ పరిజ్ఞానం లేక పోవడము. సిస్టం ఎలా పని చేస్తుంది. మన ప్రజలకి న్యాయ పరంగా రావలిసిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా సాదించుకోవడము అనేది తెలిసి ఉండాలి. సాధిచడానికి సమయము పెట్టాలి.
2) ఒక వేల రాష్త్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్ట పరిస్థితులలో ఉంటే, సమస్యల పరిష్కారానికి, కేసు బిల్డ్ చేసి మంత్రులకి ప్రెజెంట్ చేసి మన సమశ్యల మీద అనుకూల నిర్ణయం వచ్చే విధముగా చేసే పరిజ్ఞానము కూడా ఉండాలి. ఇలాంటి వారిని మనము ఎన్నుకోవాలి.
3) గెలిచిన నాయకుడి చుట్టూ తిరిగే వాళ్ళని కూడా నాయకుడు ఒక కంట కనిపెడితే అన్యాయాల్ని నిలిపిన వాళ్లవుతారు. లేకపోతే మన ఊరిలో పేద ప్రజల వారసత్వ సంపదను ఇంకొక ఊరి నాయకురాలు అన్యాయంగా స్వాధీనము చేసుకొంటుంది. బంధు ప్రీతి మరియు పార్టీ మీద వ్యామోహం లేని నాయకుడుని ఎన్నుకోవాలి.
4) పేద ప్రజల కోసం ప్రభుత్వము అమలు చేసే పధకాలు, చెట్టుకింద తెల్ల చొక్కాలు లేక పచ్చ చొక్కాల పాలవుతాయి. ప్రభుత్వము సైకిల్ లేని వాడికి సైకిల్ ఇవ్వమంటే, మోటార్ సైకిల్ వున్నవాడు ఆ సైకిల్ ని కాజేస్తే ఇంక పథకాలకు అర్ధము ఏముంది?
5) అన్నిటికంటే ముఖ్యముగా నాయకుడికి నిస్వార్థమైన సేవా గుణము కలిగి ఉండాలి. స్వార్ధము తో ఆస్తులు కూడగట్టుకొనే నాయకులని ఇంకా భరించగలమా అని ఆలోచించాలి ఓటు వేసేటప్పుడైనా.
ఏదో లోకల్ గల్లీ నాయకుల స్వార్ధము తో కులాల వారీగా విడిపోయి ఓటు వేసినంతకాలం మన మండల అభివృద్ధి ఎండ మావి లాంటిదే అని మరచి పోవద్దు. చిన్న చిన్న నేటి స్వార్ధాల కోసం మన రేపటి పౌరుల భవిష్యత్ ని అంధకారం చెయ్యడము ఎంత వరకు కరెక్ట్, ఆలోచించాలిసిన తరుణం ఆసన్నమయింది.
రండి ప్రశ్నిద్దాము. ఓటు అడిగే ప్రతి ఒక్కరిని ఈ క్రింది విధముగా ప్రశ్నిద్దాము.
1) చిన్నగంజాం మండలానికి ఏమి చేశారు?
2) గెలిస్తే ఏమి చెయ్యగలరు?
3) ఇప్పటి వరకు ఇచ్చిన మాటలను నెరవేర్చారా?
4) మీ వ్యాపారాలకు ఎంత సమయం కేటాయిస్తారు? మరి ప్రజల సమశ్యల పరిస్కారానికి ఎంత సమయం?
గ్రామ కాపురస్థులారా? మూడు ఎన్నికలు పోయేలోగా మన పిల్లల భవిష్యత్ నిర్ణయం అయిపోతుంది. ఎందు కంటే పుట్టిన బిడ్డ మూడు ఎన్నికలలో పెద్ద అయిపోయి కాలేజీ కి వెళ్ళడానికి రెడీ అయిపోతాడు. చైతన్యంతో మన పిల్లల భవిష్యత్ బాగుండాలి అంటే ఈరోజు ఓటు నిర్మొహమాటం గా ఉండాలి.
జై హింద్
శరభయ్య పోలకం

Comments
Post a Comment