Skip to main content
గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం:

చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను. 

1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు. 
2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు 
3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు 

ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను

 ఇంకా ఎవరికి చెప్పుకోవాలో తెలియని వెంకటేష్ నిస్సహాయ స్థితిలో మీ సహాయం కోసం చూస్తున్నాడు. ఇలాంటివి పర్చూరు నియోజకవర్గం స్థాయిలో కోకొల్లలు జరుగుచున్నాయి. మీరు సహృదయంతో వెంకటేష్ కి, అతని కుటుంబాన్ని  పోషించుకొనే వెసులుబాటుని కలిగించాలని విన్నవించుకొంటున్నాను. మీ ఆలశ్యం మీపై ఆశ పెట్టుకొన్న ఒక Citizen హక్కుని హరిస్తుందని మీ దృష్టికి తీసుకొని వచ్చెనందుకు వెనకడుగు వెయ్యలేక పోయినందులకు క్షంతవ్యుడను. 

జై హింద్ ,
శరభయ్య పోలకం,
చిన్నగంజాం 


Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం   

ట్రస్ట్ తన పని తాను చేసుకుపోతుంది...

1) చిన్నగంజాం మండల ప్రజలు కరెంటు బిల్ కట్టడానికి ట్రస్ట్ వారు ఆన్ లైన్ సౌకర్యము ఉచితముగా కల్పించుచున్నారు. ప్రజలు చిన్నగంజాం మండల కార్యాలయము ఆవరణయందు గల ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు. 2) చిన్నగంజాం మండలం జీడిచెట్లవారి పాలెంలో వున్న చిన్నారులు మరియు మహిళలు స్వయం ఉపాధికోసం కుట్టు  మెషిన్ స్కిల్ నేర్పించడాని ట్రస్ట్ సభ్యులు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఔత్సహికులైన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్సియల్ ఇండిపెండన్స్ సాదించాలని మనఃపూర్వకముగా కోరుకొంటున్నాను. 3) చిన్నగంజాం మండలం కాటమవారి పాలెం సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మరమత్తులు జరుగుతున్నవి. సామాజిక స్పృహ వున్న సహృదయులు ఈ పనులలో వాలంటీర్ గా పాల్గొని సమాజ సేవకి పునరంకితము కాగలరని ఆశిస్తున్నాను. సమాజ సేవకి అంకితమయిన మనకు  ఏ అడ్డంకులు లేకుండా అన్ని విధాలా సాయపడుతున్న మండల ప్రజలకి మరియు మనకు సమాజ సేవాగుణాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి సదా భక్తుడినై  ఉంటానని నాకు నేను మరల చెప్పుకుంటున్నాను. జై హింద్ శరభయ్య పోలకం