బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు, ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .
మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.
నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము. మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ మీ స్వార్ధానికి వాడటం మానండి. లోక కళ్యాణానికి, కళ్యాణ్ గారితో వారి భావజాలంతో మమేకం అవ్వండి. మీకు ప్రశాంతమైన త్రోవ కనబడుతుంది. గొప్ప ఆవిష్కరణలు ఆవిష్కరించబడతాయి.
జహింద్,
శరభయ్య పోలకం
Comments
Post a Comment