Skip to main content
నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి చిన్నగంజాం మార్కెట్ లో చాపలు, రొయ్యలు మరియు కొన్ని ఆకు కూరలు ఎప్పుడు తూకం వేసి అమ్మ లేదు ఎవ్వరును. అలా ఎందుకు చేయ్యరో ఒక్కసారి ఆలోచిద్దాము.

1) మత్స్యకారులు మరియు ఇతరులు ఎంతో శ్రమకోడ్చి వేట లో పడిన సరుకు మార్కెట్ కి తెస్తారు. అక్కడ వెంటనే చిన్నపాటి చిల్లర వ్యాపారులకు అమ్ముతారు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ వేటగాళ్లు మరియు చిన్నవ్యాపారులు ఒకే కుటుంబం లాగా అన్నమాట. అంతా చిన్నగంజాం వాళ్లే  కాబట్టి ఒకరిని ఒకరు అంతగా మోసం చేసునేది ఉండదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అండ్ జగమెరిగిన సత్యం.

2) చిరు వ్యాపారులు పచ్చి సరుకు పాడై పోయే లోపులోనే అమ్మగలగాలి. ఇది చాలా స్కిల్ తో కూడు కున్న వ్యవహారం. సరుకు బాగా వున్నప్పుడు అంటే ఫ్రెష్ గా మరియు పెద్దవి అయితే రేట్ ఎక్కువకి లేకపోతే  తక్కువకి  ఇవ్వాలి. లేక పోతే సరుకు మిగిలి పోయి చిరు వ్యాపారి నష్ట పోతాడు.  ఇక్కడ చిరు వ్యాపారి అంటే రోజు వారి కూలీలే. కష్టం చేసే ఓపిక లేక పాపం ఇంత రిస్క్ చేస్తారు.

3) ఇక్కడ వినియోగదారులు కూడా రెగ్యులర్ కస్టమర్స్. చిరు వ్యాపారులకు మరియు కస్టమర్స్ కి ఇక్కడ వున్న సంబంధం  పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఒక కేసుస్టడీ కాగలదు. నేను ఎప్పుడు ఇండియా వెళ్లినా నన్ను గుర్తు పట్టి నువ్వు పలానా మల్లి వాళ్ళ తమ్ముడివి కదా అని అడిగి మరీ సరుకు ఇస్తారు.

ఇంత న్యాయ బద్దముగా వ్యాపారం చేసే వాళ్ళ గురించి ఇలాంటి వార్తలు రావడము ఏం బాధాకరం మరియు ఖండించాలిసిన విషయం. ఎంతో బాధ్యతాయుతముగా పేపర్లో స్పేస్ ని వినియోగించాలిసిన విలేకర్లు ఇలాంటి వాటి మీద వార్త రాయడం ఎంతో శోచనీయం.

ప్రక్క ధోవల పడుతున్న సంక్షేమ పధకాల మీద వార్తలు వస్తే జనాలు హర్షిస్తారు. అసలుకే మోసం రాక ముందే ప్రింట్ మీడియా జాగ్రత్త వహించగలదని చిన్న ఆశతో

జై హింద్,
శరభయ్య పోలకం 


  

Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం   
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం