చివరకి చిత్తు కాగితాలు ఏరుకొనే వారికి కూడా సంఘాలు వున్నాయి, కాని మన గ్రామీణ ప్రజలలో సంఘస్ఫూర్తి లోపించింది అన్న కెసిఆర్ మాటలు అక్షర సత్యాలు. పని కట్టుకొని పల్లెలను విడదీసింది ఎవరు అని గట్టిగా ప్రశ్నించాలని వుంది. సాలి, మంగలి, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, కాపు, రెడ్డి, వైశ్యాస్, అయ్యవార్లు ఇలా సమాజాన్ని మళ్ళీ కలవలేని స్థితికి తీసుకొని వెళ్లి ఇప్పుడు అయ్యో రామా ఇలా జరుగుతుంది ఏమిటి అని అనొకొంటే అంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకొకటి ఉండదేమో.
ప్రతి ఆరు నెలలకి వచ్చే ఏదో ఒక ఎన్నికలలో గెలుపు కోసం రాజకీయనాయకులు ఆడే ఈ రాక్షస క్రీడలో అన్యాయముగా బలి అయ్యేది గ్రామీణులే. పట్టణవాసులు ఎన్నికల రోజుని ఒక సెలవు రోజుగా ఎంజాయ్ చెయ్యటం తప్ప ఇంకా పెద్దగా పట్టించు కొని ఈ రోజులలో అడ్డంగా బలి అవుతుంది మాత్రం పాపం గ్రామీణ ప్రజానీకమే. కులం పేరుతో జనాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని గెలిచిన తరువాత మొఖం చాటువేసే నాయకుడికి తెలియకపోవచ్చు మన గ్రామాలలో ప్రజలు ఈ కులాల కొలిమిలో ఎంత కాలి పోతున్నారో. పచ్చి రక్తం త్రాగే రాక్షసులకు ఇలాంటి రాజకీయ నాయకులకి తేడా ఏమిటి?
మరి ఈ క్రీడ కి మనం బలి అవ్వటం ఎప్పటి వరకు? మన తక్షణ కర్తవ్యం ఏమిటి? రండి అందరము మళ్ళీ పూర్వపు గ్రామాలని చూద్దాము. మనమందరము పుడమి తల్లి బిడ్డలం. కొంతమంది స్వార్ధం కోసం మనము బలివ్వడము ఆపుదాము. మన చేతిలో వున్న ఇంత చిన్నవిషయాని పట్టింపులతో లేక ఎవరో రెచ్చగొట్టిన కులాల ఫీలింగ్స్ తో చెయ్యకుండా ఉండి, మన మరియు మన భావి తరాల భవిష్యత్తు ని పాడు చేస్తే చరిత్రలో మన అంత చెడ్డవారు ఇంకొకరు కనబడరు.
జై హింద్,
శరభయ్య పోలకం

Comments
Post a Comment