Skip to main content

Media Literacy

పత్రికలలో వచ్చే వార్తలు ముఖ్యముగా ఈ క్రింద విధముగా రాస్తారు.

1) వార్త ఎందుకు, ఎలా మరియు  ఏ పర్పస్ కోసం రాయాలి. 

2) వార్తని వ్యక్తులు ఎలా అర్ధం చేసుకొంటారు? సామాజిక సాంప్రదాయాలు వార్తని ఎలా ప్రభావితం చేస్తాయి? వ్యకి నమ్మకాలని మరియు ప్రవర్తనని ఎలా మారుస్తాయి అనే స్పృహ ఉండేలా వుందా?

3) వార్త మన చుట్టూ  వున్న ధర్మ బద్దమైన మరియు న్యాయ బద్దమైన ఇష్యూ మీద ప్రాధమిక విషయం జ్ఞానాన్ని అందించేలా వుందా?  

ఇలా రూపుదిద్దుకున్న క్వాలిటీ వార్తలతో మనకు స్వతంత్రం వచ్చింది, అనేక దేశాలలో ప్రజలు తమకు నచ్చిన రాజ్యాలను సాధించుకొన్నారు. చివరకి అమెరికా అధ్యక్షుడికి కూడా దడ పుట్టించే నిబద్దత సొంతమని చాటించింది మీడియా. 

కానీ ఇలాంటి నిర్మొహమాటమైన వార్తలు రాయడానికి ఉన్నత చదువులతో పాటు సంస్కారం, దేశసేవ, సామాజిక స్పృహ లాంటివి విలేఖరికి లేదా రిపోర్టర్స్ కి తప్పకుండ ఉండాలి. మరి మన చుట్టూ తిరుగుతున్న విలేకర్లకు ఇలాంటివి ఉన్నాయా? ఏ చదువు అబ్బని మరియు ఏ ఉద్యోగం రాని, ఎందుకు కొరగాని వారు విలేకరి అవతారమెత్తితే ఏమై పోవాలి మన సమాజం? అసలు ఇన్ని మాస్ కమ్యూనికేషన్స్ ఇన్స్టిట్యూట్ నుండి వస్తున్న వేలాది మంది కి ఇలాంటి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడము లేదు?

1) ప్రొఫెషనల్ విలేఖరికి ఎక్కువ శాలరీ ఇవ్వాలి. వార్తలని అమ్ముకొనే ఈ రోజులలో ఇంత మొత్తం ఇచ్చి విలేకరి ఉద్యోగంలో పెట్టడము కత్తి మీద సాము. స్వార్ధానికి మరో రూపం ఈనాటి దినపత్రిక...  

2) నిజమైన వార్త చేదుగా ఉంటుంది.  పత్రిక యజమానికి మరియు కొమ్ముకాసే పార్టీలకి. కాబట్టి నిజమైన విలేకర్లు ఇక్కడ పనికి రారు. వారికి నచ్చే వార్త రాసే వారికే పెద్ద పీట. స్వార్ధానికి మరో రూపం ఈనాటి దినపత్రిక...  

ఇన్ని ఇబ్బందులు దేనికి? కొంచెం శాలరీతో ఎవరో ఒకరిని పెట్టేస్తే పోలా? పర్యవస్తానం, మన చుట్టూ వున్న చెత్త. కానీ ఇక్కడే అసలుకే మోసం. ఏదో ఒకటి రాస్తారులే అని విలేఖరులని పెట్టుకొన్న పత్రికలకి ఈ రోజు ఒక షాకే. మన విలేకరి ముసుగు వేసుకొన్న చెత్త, కొత్త పోకడలు బహుశా ఎవరి ఊహకి అంది ఉండదేమో?

1) గ్రామాల గొడవలోకి విలేకరిగా ఎంటర్ అయ్యి పంచాయితీలు చెయ్యడము నేర్చుకొన్నారు మన ఈనాటి విలేకర్లు. ఊరిలో వారే విలేకరి గా వుండటము వలన ఈ దౌర్భాగ్యము వచ్చిందేమో పత్రిక యజమానులు చూడలిసిన అవసరము వచ్చింది ఇప్పుడు. 

2) ప్రభుత్వ పధకాలు పేదలకి చెందకుండా కొంతమంది పార్టీలో వున్న చోటా కార్య కర్తలు పంచుకొంటుంటే కాదని చెప్పి వారిని సరిఅయిన దారిలో పెట్టాలిసిన విలేకర్లు వాటా కోసం పోటీ పడితే మరి మన ఫోర్త్ ఎస్టేట్ ఏమైపోయింది? ఊరిలో వారే విలేకరి గా వుండటము వలన ఈ దౌర్భాగ్యము వచ్చిందేమో పత్రిక  యజమానులు చూడాలిసిన అవసరము వచ్చింది ఇప్పుడు. 

3) ప్రజలకి సౌకర్యాలు కల్పించాలిసిన MRO, MDO లాంటి ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ కలిపించాలిసిన పోలీసు వ్యవస్థని కూడా బ్లాక్మెయిల్ చేసేటంత వరకు విలేకర్లు వచ్చారంటే మనము ఎటు పోతున్నాము ఊరిలో వారే విలేకరి గా వుండటము వలన ఈ దౌర్భాగ్యము వచ్చిందేమో పత్రిక  యజమానులు చూడాలిసిన అవసరము వచ్చింది ఇప్పుడు.

4) చివరికి చిన్న పిల్లలకి పోషకాహారం అందించాలిసిన అంగన్వాడీ కూడా వీరి కబ్జాకి బలి అవుతుంటే చూస్తూ ఊరుకొంటే రేపు మన ఇంటిలోకి వచ్చిన ఆపలేము ఏమో? 

చిన్నగంజాం ప్రజలకి నా విన్నపం. మన సమస్యలని మనమే పరిష్కరించుకొందాము. చేయి చేయి కలుపుదాం, ప్రతి ఒక్కరు ఒక వేగు అవుదాము. విలేకర్లు చేసే ధాష్టీకాలనీ నేరుగా జిల్లా స్థాయి అధికారులకి తెలియ జేయండి. జిల్లా స్థాయి అధికారులని ఎలా కలవాలో తెలుసుకోవాలంటే నాకు ఫేసుబుక్లో ప్రైవేట్ మెసేజ్ పెట్టండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను.

నిన్నటి చిన్నగంజాం ని మళ్లి రేపు చూద్దాము, రండి, పోయేదేముంది ఈ చెత్త వార్తలు తప్ప... 



జైహింద్
శరభయ్య పోలకం   
 

  

Comments

Popular posts from this blog

గౌరవనీయులు ముఖ్య/ఉపముఖ్యమంత్రి వర్యులకు విన్నపం: చిన్నగంజాం గ్రామ కాపురస్థుడు. గంటా వెంకటేష్ ఉన్నత చదువులు(BE, Computer Science) చదివి, ఉద్యోగం రాక చివరికి వ్యవసాయం లోకి దిగి కుటుంబాన్ని పోషించుకొంటుంటే, అతన్ని పాలక వర్గంగా చెప్పుకొంటున్న పర్చూరు నియోజకవర్గం నాయకులు పెడుతున్న బాధలు మీ దృష్టికి తీసుకురావడం ఒక పౌరుడిగా నా బాధ్యతనెరిగి మీ దృష్టికి తెస్తున్నాను.  1) అతని agriculture tractor మరియు JCP లను ఎటువంటి గవర్మెంట్ పనులకి పిలవకుండా మరియు ప్రైవేట్ పనులకి కూడా పిలవనివ్వకుండా చేస్తున్నారు.  2) ఆరుగాలం కష్టపడి పండించిన రొయ్యలని పట్టుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు  3) పోలీస్ కేసు కూడా తీసుకోకుండా పోలీస్ వారిని కంట్రోల్ చేస్తున్నారు  ఇవన్నీ ఒక పౌరునికి సముచితమైన మరియు నిస్పాక్షికమైన పరిపాలనని అందించడములో విఫలమవడమేనని నా అభిప్రాయం మరియు నమ్మకము. మిమ్మల్ని బలపరచి ఆంధ్రప్రదేశ్ కి  మంచి పాలకుల్ని ఎన్నుకొనడములో ప్రజలని ప్రభావితం చేసిన సైనికుడిగా మరియు ఒక సాటి పౌరునిగా, ఈ వైఫల్యమును మీ ముందుకు తీసుకొనిరావడం నా కర్తవ్యముగా భావిస్తున్నాను  ఇంకా ఎవరికి...

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం