చిన్నోడా ఆ కరెంటు బిల్ కలెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు పొలం వెళ్ళాను, కరెంటు బిల్ కట్టలేదు. కొంచెం కరెంటు ఆఫీస్ కి వెళ్లి బిల్ కట్టిరా. బిల్ కలెక్టర్ సాయంత్రం వస్తాడు కడతానులే సమాధానం ఇచ్చిన రోజునే బిల్ కట్టి బిల్ కాగితం ఇంట్లో ఇచ్చాను. రాను రాను జనాలు పెరిగారు, కనెక్షన్స్ పెరిగాయి. కానీ బిల్ కలెక్టర్లు ని పెంచడం ప్రభుత్వానికి తలకి మించిన పని అయ్యింది.
పనికి ఆహరం పధకాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉద్యోగ కల్పనలో చూపించలేక పోయింది. ఫలితం, మీసేవ... ఇలాంటి సేవలన్నీ, ప్రభుత్వం చేయడానికి ఉద్యోగులు అవసరం, కానీ మన ప్రభుత్వాలు అక్కడ పొదుపు సూత్రం గట్టిగా పాటించి మీసేవ అనే ప్రైవేట్ / పొరుగు సేవల కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ అక్కడే పొరుగు సేవల నిర్వాహకుల విషయము లో మంచి సుద్ధ పప్పులో కాలు వేసింది.
మీసేవ నిర్వాహకులు సేవని వ్యాపారం చేయడానికి ఎన్నో ఎక్కువ రోజులు తీసుకోలేదు. Rs. 10/- తీసుకోవలసిన అప్లికేషన్ కి షుమారుగా Rs. 300/- ఛార్జ్ చెయ్యడము, అది ఒక కస్టమరీ గా మారి పోవడము జరిగిపోయింది. మరి ఆకలితో వున్నవాడిని అరిశలకి కాపలా పెట్టి అరిసెలు తినవద్దు అంటే ఎలా? కానీ దాని వలన బలిఐన "రోజు-గడవని పేద ప్రజలని" చూస్తుంటే బాధ.
1) ప్రజలకి సేవ చేసే ప్రభుత్వ రంగాలకి జవసత్వాలు ఇచ్చి తద్వారా ఉద్యోగ కల్పన చేస్తే అటు నిరుద్యోగం , ఇటు ప్రజలకి మంచి సర్వీస్ లభిస్తుంది అనడం సత్య దూరం కాదేమో, చంద్రబాబు ఆలోచిస్తే జనాలు భ్రహ్మరధం పడతారు.
2) హోటల్ లో మెనూలో ఖరీదు ఎలా వేస్తారో, మీసేవ కార్యాలయం లో కూడా రేట్స్ పట్టి ఒకటి పబ్లిక్ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో?
3) నిజానికి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ని కంట్రోల్ చెయ్యడము లో మీడియా మంచి పాత్ర పోషించాలి. కానీ ఈ రోజులలో మీడియా "వారి వారి పార్టీలకి" ప్రచారము చెయ్యడము లో బిజీ అయిపోయాయి గనుక ఈ బాధ్యతని సామాజిక కార్యకర్తలు పోషిస్తే కొంచెం జవాబిదారుతత్వం పెరగవచ్చు.
చంద్రబాబు గారి పిలుపు మేరకు గ్రామాన్ని దత్తత తీసుకొన్న తరువాత చాలా మంది సామాజిక కార్యకర్తలు కలసి వచ్చి గ్రామంలో వున్న పరిస్థితులని మెరుగు పరుస్తున్నారు. ఈ మద్య మా గ్రామములో వున్న మీసేవ ఇర్రెగ్యులారిటీస్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి సరి చెయ్యడము చూస్తే నాకు గర్వంగా వుంది. ప్రజలు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రభత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడము ఒక పౌరుడిగా మన బాధ్యత.
ఇది ఒక inspiration గా తీసుకొని అన్యాయం ఏ రూపంలో వున్నా ప్రభుత్వ యంత్రాంగానికి తెలియ చేయాలని చిన్నగంజాం గ్రామ ప్రజలకి నా అప్పీల్. నిజం వైపే మంచి ఉంటుంది. ప్రభుత్వము ఉంటుంది.
ప్రజలు నిజాల్ని విస్మరించి మనకు ఎందుకు అని అనుకొంటే మన దాకా వచ్చేసరికి పెనుభూతం అయ్యి కూర్చుంటుంది అన్యాయం.
జైహింద్,
శరభయ్య పోలకం
శరభయ్య పోలకం
Comments
Post a Comment