తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???
ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు.
జైహింద్
శరభయ్య పోలకం
- మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.
- విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.
- తమ తమ పాయింట్ క్లియర్ గా, నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది.
- రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను.
- మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.
- మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.
- టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...
- 2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్రం ఎంత ఇచ్చింది ఇంకా ఎంత ఇవ్వాలి అన్న మాటే లేదు.
- ఆర్డర్ లో వున్న సభని స్లోగన్ ఇచ్చి గందరగోళం సృష్టించి మన తెలుగు వాళ్ళ పరువు మల్లి పార్లమెంట్ సాక్షిగా పలచన చేశారు.
- చంద్రబాబు ఫెయిల్యూర్ మోడీ నోటి నుండి వినబడింది. ఇప్పటి వరకు సందేహం వున్న తెలుగు ప్రజలకి చంద్రబాబు మీద వున్న ఆకాస్త నమ్మకము కూడా పోయింది.
- చంద్రబాబు కి వైసీపీ అంటే భయం అన్న పవన్ కళ్యాణ్ మాట నిజం అని మోడీ గారు చెప్పకనే చెప్పారు.
- నైతికంగా సాక్ష్యాత్తు దేశ ప్రధాని తో అక్షింతలు వేయించుకున్న చంద్రబాబు గారు గౌరవంగా పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళడము.
- అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలని కలిపి అసలు మనకు స్పెషల్ స్టేటస్ అవసరమా కాదా అని తేల్చడము.
- భవిష్యత్ లో తమ మాట మాత్రమే వినేవాళ్ళని కాకుండ, చదువు మరియు తెలివితేటలు వున్నవాళ్లను చట్ట సభలకి పంపించడము.
- ఇప్పుడు వున్న క్షేత్రస్థాయి కార్యకర్తలని ప్రక్షాళన చెయ్యడము. నిజమైన ప్రజల నాయకులని ప్రోత్సహించడము.
జైహింద్
శరభయ్య పోలకం
Comments
Post a Comment