Skip to main content

Posts

సద్విమర్శని స్వీకరించడము కూడా ఒక గొప్ప విషయమే

బలవంతులదే రాజ్యం, అనాదిగా వస్తున్న రాజనీతి ఇది. పూర్వం గెలిచిన రాజు  రాజ్యమేలితే, ఇప్పుడు నోటోళ్ళు రాజ్య మేలుతున్నారు. ఎవరైనా మంచి చేద్దామని వస్తే నోటితో బెదరగొట్టి తరిమేస్తున్నారు. ఇదే స్ట్రాటజీ అన్ని స్థాయిల్లో ఉండటాన్ని గమనించాను. పీఎం, సీఎం, ఎంపీ, ఎంల్ఏ  స్థాయి నుండి గల్లీ లీడర్ వరకు ఇదే తంతు. మరి యధా రాజా తధా ప్రజా కదా? ప్రతిపక్ష నాయకుడు ఒక విమర్శ చేసినప్పుడు, నిజమైన నాయకుడు ఆ విమర్శకి సమాధానం చెప్పి విమర్శని తిప్పి కొట్టవచ్చు, లేదంటే తప్పుని ఒప్పుకొని సరిజేసుకోవచ్చు. సద్విమర్శని స్వీకరించడము కూడా ఒక గొప్ప విషయమే. జైహింద్ శరభయ్య పోలకం   

ట్రస్ట్ తన పని తాను చేసుకుపోతుంది...

1) చిన్నగంజాం మండల ప్రజలు కరెంటు బిల్ కట్టడానికి ట్రస్ట్ వారు ఆన్ లైన్ సౌకర్యము ఉచితముగా కల్పించుచున్నారు. ప్రజలు చిన్నగంజాం మండల కార్యాలయము ఆవరణయందు గల ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు. 2) చిన్నగంజాం మండలం జీడిచెట్లవారి పాలెంలో వున్న చిన్నారులు మరియు మహిళలు స్వయం ఉపాధికోసం కుట్టు  మెషిన్ స్కిల్ నేర్పించడాని ట్రస్ట్ సభ్యులు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఔత్సహికులైన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్సియల్ ఇండిపెండన్స్ సాదించాలని మనఃపూర్వకముగా కోరుకొంటున్నాను. 3) చిన్నగంజాం మండలం కాటమవారి పాలెం సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మరమత్తులు జరుగుతున్నవి. సామాజిక స్పృహ వున్న సహృదయులు ఈ పనులలో వాలంటీర్ గా పాల్గొని సమాజ సేవకి పునరంకితము కాగలరని ఆశిస్తున్నాను. సమాజ సేవకి అంకితమయిన మనకు  ఏ అడ్డంకులు లేకుండా అన్ని విధాలా సాయపడుతున్న మండల ప్రజలకి మరియు మనకు సమాజ సేవాగుణాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి సదా భక్తుడినై  ఉంటానని నాకు నేను మరల చెప్పుకుంటున్నాను. జై హింద్ శరభయ్య పోలకం

సాహా చిన్నగంజాం పోలీస్

రొయ్యల చెరువులలో బాటమ్ పనులు చేయించి పంపింగ్కి రెడీ గా వున్న చెరువుల కట్టలని పగల గొట్టుకొని జేసీబీ ని మరియు ట్రాక్టర్లు ని దౌర్జన్యముగా మరియు ఇంఫార్మ్ చెయ్యకుండా తీసుకొని వెళ్లి సొంత పనులు చేసుకోవడము తప్పు మరియు అన్యాయం. దానిని సమర్ధించడము ఇంకా తప్పు. ఇది చిన్నగంజాం గ్రామ మరియు చిన్నగంజాం మండల రక్షణ విషయము. గ్రామానికి బయటి వ్యాపారులు వచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడము పరిపాటి. ఇలాంటి స్వేచ్చకీ ఆటంకము కలిగించడము క్షమిచారాని నేరం. చిన్నగంజాం పోలీస్ వారు చాకచక్యముతో ఈ అన్యాయాన్ని  నివారించి మరలా గ్రామములో శాంతిని రిస్టోర్ చేసినందుకు నా అభినందనలు. "సాహా చిన్నగంజాం పోలీస్".  చిన్నగంజాం అంటే ఒక స్వేచ్చా విపణి. తరతరాలుగా ఈ మంచి పేరు మన ఆయుధం. మనము పాటించే శాంతి సుస్థిరత వలన మనకు వచ్చిన మంచి అధికారులు కూడా ఎక్కువకాలం మన గ్రామము లోనే ఉండటానికి ఇష్టపడుతారు.  చిన్నగంజాం పోలీసు వారికి మరలా మరలా నా ధన్యవాదములు మరియు అభినందనలు.   అన్యాయాన్ని సమర్ధించడం అన్యాయం చెయ్యడముకన్నా పెద్ద తప్పు. మనము అన్యాయాన్ని ప్రశ్నించని రోజు అన్యాయాన్ని చ...

పేద వారు పెద్ద వారైతే యెట్లా?

పూర్వం రాజులు ఆ తరువాత భూస్వాములు ప్రజలను తమ చెప్పు చేతలలో ఉంచుకొని బానిసత్వాన్ని పెంచి పోషించి ప్రజల కష్టం మీద బ్రతుకుతూ, ఆ విషయం ప్రజలకి తెలియకుండా రాజ్య పరిపాలన అనే మాటను అడ్డు పెట్టుకొని కాలం నెట్టుకొచ్చారు. కాల క్రమేణా రాజ్యాలు, భూస్వాములు ప్రజల ధాటికి కొట్టుకొని పోయి మనుగడ సాదించలేక కొత్త ముసుగుతో వేషం మార్చారు. మనం వారిని ఈ రోజుల్లో రాజకీయ నాయకులు అంటున్నాము. సంక్షేమ పధకాలు ప్రజలకోసం తెచ్చాము అంటారు కానీ, తరువాత మన పార్టీ పర పార్టీ అని మనలో మనకు బేధాలు సృష్టిస్తారు. అంతలోనే వారి పార్టీ  లో కూడా పలానా వారు ఎక్కువ ఖర్చు పెట్టారు అని అక్కడ కూడా పెద్దపీట నాయకులకే వేస్తారు. పూరెస్ట్ అఫ్ పూర్ అనే మాటకి అర్ధాలు మార్చారు. అసలు, సంక్షేమ పధకాలు పేద ప్రజలకి అన్న విషయం మరచి పోయి, పెద్ద వారికే అన్నట్టు గా వ్యవహరిస్తారు. ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తే పర పార్టీ ముద్ర వేస్తారు. అయినా కానీ ఎన్నికలలో మళ్లి వారే డబ్బుతోనో లేక మద్యం తోనో  గెలుస్తారు. పేద వారు పెద్ద వారైతే యెట్లా? మా మోసాలు తెలిసి మాకు ఎదురు తిరిగితే ఇప్పుడు వున్నా రాజకీయ ముసుగు తీసి వేసి ఇంకొక ముసుగు వ...

తెల్లచొక్కాల వలన ప్రభుత్వ వ్యతిరేకత

నాకు ఎన్నో రోజుల నుండి ఇది ఒక ఒక కొరకరాని కొయ్యగా వుంది. చంద్రబాబు గారు మరియు మోడీ గారు చాలా సీరియస్ గా రోజువారీ పేపర్లో ప్రజలకి తెలియజేసే విషయాలు తెల్లచొక్కాలకి వర్తించవా? చంద్రబాబు (గౌరవ AP సీఎం గారు) ప్రకటన : ప్రజలు బ్రతుకుదెరువు కోసం రాజకీయాలకి రాకూడదు.   చంద్రబాబు (గౌరవ AP సీఎం గారు) ప్రకటన : సంక్షేమ పథకాలలో వివక్ష ఉండకూడదు. స్వపక్షానికి మరియు విపక్షానికి అందరికి అందాలి.  మరి మా మండలం లో ఇలా ఎందుకు జరగడము లేదు. ఇదేమి అన్యాయం అని అడిగిన సర్పంచిని కొట్టించి అడ్డు వచ్చిన ప్రజలని పోలీసులతో సన్మానాలు చేయిస్తున్న తెల్ల చొక్కాలకి చంద్రబాబు గారి మాటలు ఎందుకు వినబడటము లేదు?   చివరికి తెల్లచొక్కాల వలన ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినా అధిష్టానం నోరు మెదపనంతటి బలహీనత ఎక్కడ వుంది? ఏమో నాకేటి తెలుసు, ఆ శివయ్య ఏటనుకొంటున్నాడో ఏటో? ...    

కాపుల లోన్ లు, వృద్ధుల పింఛన్లు , సర్కార్ ఇండ్లు చివరకి మోడీ మరుగు దొడ్లు కూడా తెల్ల చొక్కాల పాలు...

ఇది తెల్ల చొక్కాల అంతం. కాపుల లోన్ లు, వృద్ధుల పింఛన్లు , సర్కార్ ఇండ్లు చివరకి మోడీ మరుగు దొడ్లు  కూడా తెల్ల చొక్కాల పాలవుతుంటే చూస్తూ ఊరుకోలేక ప్రభుత్వ పధకాలు పేద ప్రజలకి అందించాలి అన్న ఒకే ఒక ధ్యేయం తో మన పోలకం శరభయ్య చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. MRO ఆఫీస్ దగ్గరలో ఒక ఆఫీస్ ఓపెన్ చెయ్యడము జరుగింది. ప్రభుత్వ పధకాల కోసం ధరకాస్తు చేసుకొనే వారికి చేయూత నిస్తుంది. తెల్ల చొక్కాల ఉనికిని ప్రశ్నిస్తుంది. ప్రజల సంపదకు కాపు కాస్తుంది. రండి, చేయిచేయి కలుపుదాం. తెల్ల చొక్కాల అంతు చూద్దాం!!! జై హింద్, శరభయ్య పోలకం

ప్రభత్వ సొమ్ముని స్వాహా చేసిన సత్యం వతులని ఏమి చెయ్యాలని మోటుపల్లి ప్రజలని అడిగినప్పుడు వారి స్పందన చెప్పడానికి మాటలకు కరువు

ఎన్నో సంవత్సరాల మేధో మథనం, ఎందరో కలల స్వప్నం చిన్నగంజాం మండలం ప్రజల ఐఖ్య వేదిక మన ట్రస్ట్. ఇన్ని రోజుల పాద యాత్ర ఎన్నో జవాబు లేని ప్రశ్నలకి సమాధానాలు వెతికింది. ఊరంతా బ్రహ్మ రధం పట్టింది, తెల్లచొక్కాలకి చమటలు పట్టించింది. ఎన్నో బెదిరింపులు, ఫ్లెక్సీల పై ప్రతాపాలు, వెరసి వెగటు పుట్టించే గల్లీ నాయకుల రంగులు, సామాన్యుల పై వారి దాష్టికాలు. ఏమి చెయ్యలేని సామాన్యుల అచేతన స్థితి. నేను తెలుసుకొన్న విషయాలు ఒక్కొక్కటి గా ఫేసుబుక్ సాక్షి గా ప్రజల కి తెలియచేయటం నా విధిగా భావించి ఈ సిరీస్ ని ప్రారంభిస్తున్నాను. మొదటిగా స్వచ్ఛ భారత్ మిషన్ ,  ఎంతో గర్వించదగ్గ ఒక కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రజల క్షేమం మరియు ఆరోగ్యం కోసం పెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం, స్వార్ధ పరుల చేతుల్లో చేవ చచ్చి చతికిల పడటం చూస్తుంటే వ్యవస్థ మీద అసహ్యం వేస్తుంది.  దగ్గర వుండి ప్రజల డబ్బు పరుల పాలు కాకుండా చూడవలసిన ప్రజా ప్రతినిధులు, ప్రజలకి  చెందవలసిన ఈ పధకాన్ని ఒక పధకం ప్రకారం దోచుకుంటుంటే చూస్తూ ఊరుకొంటున్న ప్రభుత్వ యంత్రంగం, మీడియా ల మీద వున్నా కించిత్తు గొరవం కాస్తా గంగ పాలు కాక...