రొయ్యల చెరువులలో బాటమ్ పనులు చేయించి పంపింగ్కి రెడీ గా వున్న చెరువుల కట్టలని పగల గొట్టుకొని జేసీబీ ని మరియు ట్రాక్టర్లు ని దౌర్జన్యముగా మరియు ఇంఫార్మ్ చెయ్యకుండా తీసుకొని వెళ్లి సొంత పనులు చేసుకోవడము తప్పు మరియు అన్యాయం. దానిని సమర్ధించడము ఇంకా తప్పు. ఇది చిన్నగంజాం గ్రామ మరియు చిన్నగంజాం మండల రక్షణ విషయము. గ్రామానికి బయటి వ్యాపారులు వచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడము పరిపాటి. ఇలాంటి స్వేచ్చకీ ఆటంకము కలిగించడము క్షమిచారాని నేరం.
చిన్నగంజాం పోలీస్ వారు చాకచక్యముతో ఈ అన్యాయాన్ని నివారించి మరలా గ్రామములో శాంతిని రిస్టోర్ చేసినందుకు నా అభినందనలు. "సాహా చిన్నగంజాం పోలీస్". చిన్నగంజాం అంటే ఒక స్వేచ్చా విపణి. తరతరాలుగా ఈ మంచి పేరు మన ఆయుధం. మనము పాటించే శాంతి సుస్థిరత వలన మనకు వచ్చిన మంచి అధికారులు కూడా ఎక్కువకాలం మన గ్రామము లోనే ఉండటానికి ఇష్టపడుతారు. చిన్నగంజాం పోలీసు వారికి మరలా మరలా నా ధన్యవాదములు మరియు అభినందనలు.
అన్యాయాన్ని సమర్ధించడం అన్యాయం చెయ్యడముకన్నా పెద్ద తప్పు. మనము అన్యాయాన్ని ప్రశ్నించని రోజు అన్యాయాన్ని చేసే వారికి టానిక్ ఇచ్చినట్లే. సమాజం చెడిపోవడానికి ప్రధమ కారణం ఇలాంటి అన్యాయాయం చేసే వారిని సమర్ధించడమే. ఇలాంటి వారి మీద కూడా చట్ట పరమైన చర్యలు తీసుకొంటే సమాజము లో అన్యాయాన్ని అరికట్ట వచ్చు. లేకపోతే పది మంది చెడ్డవారు సిండికేట్ గా మారి సమాజాన్ని సర్వ నాశనం చేసే అవకాశం లేకపోలేదు.
తప్పు చెయ్యడము అదేదో హీరోయిజం లాగా ఫీల్అయ్యి కాలర్ ఎగరవెయ్యడమూ మానాలంటే అలంటి వారిని వారి చేసే తప్పులను ప్రశ్నించడమే సభ్యసమాజములో వున్న మనము చెయ్యగలిగే ప్రధమ కర్తవ్యం. మనలని ఎవరైనా సపోర్ట్ కి రమ్మని అడిగితే, మొదట మనము వారిని అసలు సమస్య గురించి అడగాలి. ఆ సమస్య లో న్యాయం ఎవరి వైపు ఉందొ ఆలోచించాలి. న్యాయం వైపు వుండి న్యాయాన్ని గెలిపించాలి. మన ఊరిలో వున్న సమస్య గురించి మనము చెప్పే సాక్ష్యంకి ఎక్కువ విలువ ఉంటుంది. అలాంటిది మనమే అధికారులను తప్పు దోవ పట్టించి అన్యాయానికి వత్తాసు పలకడము ఎంత మాత్రము హర్షించదగ్గే విషయము కాదు. ఆ దేవుడు కూడా అన్యాయాన్ని సమర్ధించే వాళ్ళని క్షమించడు.
పిల్లలు తప్పు చేస్తే అది మనము సరి చెయ్యకపోతే మరి మనము పెద్దలుగా ఊరిలో వుండి చేస్తున్నది ఏమిటి? ఒకవేల సమస్య లో ఎవరి వైపు న్యాయం వున్నదో క్లారిటీ లేనప్పుడు ఊరిలోనే సమస్య గురించి డిస్కషన్స్ చేసి సమస్య పరిష్కారానికి కృషి చెయ్యవచ్చు. అది చెయ్యకుండా తప్పుని వెనకేసుకొని రావడము మరియు సమర్ధించడము చేస్తే, చెడిపోతున్న పిల్లలని ఎవరు మంచి దారిలో పెడతారు.
ఒక సారి తప్పు చేస్తే క్షమించాలి, రెండు సార్లు చేస్తే తప్పు చూపించాలి. మరి పదే పదే చేస్తే దానిని మా ఊరిలో బలుపు అంటారు. అలాంటి వారిని మరి మనము ప్రశ్నించక పోతే సభ్య సమాజానికి మనము ఏమి చెబుతున్నట్లు? ఇలాంటి వారు మేము ఊరిలో పెద్దలం అని ముసుగు వేసుకొని తిరుగుతుంటే అసలు పెద్దరికం చిన్నబోదా?
జై హింద్
శరభయ్య పోలకం

Comments
Post a Comment