
కాల క్రమేణా రాజ్యాలు, భూస్వాములు ప్రజల ధాటికి కొట్టుకొని పోయి మనుగడ సాదించలేక కొత్త ముసుగుతో వేషం మార్చారు. మనం వారిని ఈ రోజుల్లో రాజకీయ నాయకులు అంటున్నాము. సంక్షేమ పధకాలు ప్రజలకోసం తెచ్చాము అంటారు కానీ, తరువాత మన పార్టీ పర పార్టీ అని మనలో మనకు బేధాలు సృష్టిస్తారు. అంతలోనే వారి పార్టీ లో కూడా పలానా వారు ఎక్కువ ఖర్చు పెట్టారు అని అక్కడ కూడా పెద్దపీట నాయకులకే వేస్తారు. పూరెస్ట్ అఫ్ పూర్ అనే మాటకి అర్ధాలు మార్చారు.
అసలు, సంక్షేమ పధకాలు పేద ప్రజలకి అన్న విషయం మరచి పోయి, పెద్ద వారికే అన్నట్టు గా వ్యవహరిస్తారు. ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తే పర పార్టీ ముద్ర వేస్తారు. అయినా కానీ ఎన్నికలలో మళ్లి వారే డబ్బుతోనో లేక మద్యం తోనో గెలుస్తారు.
పేద వారు పెద్ద వారైతే యెట్లా? మా మోసాలు తెలిసి మాకు ఎదురు తిరిగితే ఇప్పుడు వున్నా రాజకీయ ముసుగు తీసి వేసి ఇంకొక ముసుగు వేసుకోవాలేమో కదా? కాబట్టి పేద ప్రజలు పేదలుగానే మిగిలి పోవాలి.
లేకపోతే మరేమిటి? ఈ సంక్షేమ పధకాల పేరుతో అయినవారికి ప్రజల సొమ్ముని దోచిపెట్టే బదులు, ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు లేకపోతే స్వయం ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలు నిర్మించవచ్చు కదా?
చివరికి మన గౌరవ ప్రధాన మంత్రివర్యులు మోడీజీ గారు పెట్టిన ముద్ర లోన్స్ కూడా ప్రజలకి అందించలేని దౌర్భాగ్యం ఎందుకు?
మన పని మనమే చేసుకొందాము. చారిటబుల్ ట్రస్ట్ వారు ముద్ర లోన్స్ మీద కాన్సంట్రేషన్ చెయ్యాలని మనవి.
జై హింద్,
శరభయ్య పోలకం
Comments
Post a Comment