ప్రభత్వ సొమ్ముని స్వాహా చేసిన సత్యం వతులని ఏమి చెయ్యాలని మోటుపల్లి ప్రజలని అడిగినప్పుడు వారి స్పందన చెప్పడానికి మాటలకు కరువు
ఎన్నో సంవత్సరాల మేధో మథనం, ఎందరో కలల స్వప్నం చిన్నగంజాం మండలం ప్రజల ఐఖ్య వేదిక మన ట్రస్ట్. ఇన్ని రోజుల పాద యాత్ర ఎన్నో జవాబు లేని ప్రశ్నలకి సమాధానాలు వెతికింది. ఊరంతా బ్రహ్మ రధం పట్టింది, తెల్లచొక్కాలకి చమటలు పట్టించింది.
ఎన్నో బెదిరింపులు, ఫ్లెక్సీల పై ప్రతాపాలు, వెరసి వెగటు పుట్టించే గల్లీ నాయకుల రంగులు, సామాన్యుల పై వారి దాష్టికాలు. ఏమి చెయ్యలేని సామాన్యుల అచేతన స్థితి. నేను తెలుసుకొన్న విషయాలు ఒక్కొక్కటి గా ఫేసుబుక్ సాక్షి గా ప్రజల కి తెలియచేయటం నా విధిగా భావించి ఈ సిరీస్ ని ప్రారంభిస్తున్నాను.
మొదటిగా స్వచ్ఛ భారత్ మిషన్, ఎంతో గర్వించదగ్గ ఒక కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రజల క్షేమం మరియు ఆరోగ్యం కోసం పెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం, స్వార్ధ పరుల చేతుల్లో చేవ చచ్చి చతికిల పడటం చూస్తుంటే వ్యవస్థ మీద అసహ్యం వేస్తుంది. దగ్గర వుండి ప్రజల డబ్బు పరుల పాలు కాకుండా చూడవలసిన ప్రజా ప్రతినిధులు, ప్రజలకి చెందవలసిన ఈ పధకాన్ని ఒక పధకం ప్రకారం దోచుకుంటుంటే చూస్తూ ఊరుకొంటున్న ప్రభుత్వ యంత్రంగం, మీడియా ల మీద వున్నా కించిత్తు గొరవం కాస్తా గంగ పాలు కాక మానదు.
1) మనిషి కూడా పట్టని లెట్రిన్ దొడ్డి, చెత్తకుప్పలుగా రూపాంతరం చెందటం చోచనీయం. ప్రభుత్వం 15000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన దొడ్డి ని మీరు వాడకుండా చెత్తకుప్పగా మార్చడము కరెక్ట్ యేనా అని అడిగిన స్పెషల్ ఆఫీసర్ కి దిమ్మ తిరిగే సమాధానం ప్రజలు ఇవ్వడము చూచాను. ఏమి చెయ్యమంటారు సారూ, దాని లోకి పోతే మల్లి తిరిగి రాము, అంత చిన్నది.
2) సగం కట్టి బిల్స్ చేసుకొని గాలికి వదిలి వేసిన మొండి గోడలుని నిద్ర లేవగానే చూచే చుకొని, ఆమ్మో ఈ రోజు ఏమి కీడు జరుగుతుందో అని హడలి పోయినా రోజులు లెక్క లేనన్ని. చెంబు పట్టుకొని పొలం లోకి పోవడము మారక పోగా, కనీసం ప్రశాంతముగా నిద్ర లేచే భాగ్యానికి కరువయింది.
3) ఇప్పటికే పెద్ద ఇల్లు కట్టుకొని, లెట్రిన్ కూడా వున్నవారిని కూడా మభ్య పెట్టి వారికీ లెట్రిన్ కట్టించినట్లు బిల్స్ చేయించుకొని ప్రభత్వ సొమ్ముని స్వాహా చేసిన సత్యం వతులని ఏమి చెయ్యాలని మోటుపల్లి ప్రజలని అడిగినప్పుడు వారి స్పందన చెప్పడానికి మాటలకు కరువు.
ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వున్న తెల్ల చొక్కాలని తొలగిస్తే ఈ దుస్థితి పోతుందనేది అందరూ ఎరిగిన సత్యం. ప్రజలకి డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బు వేసి వారి పనులు వారి చేతే చేయిస్తే ఎప్పటికైనా బాధ్యతాయుతమైన పౌరులని చూస్తామేమో. మార్పు ఒక్క సారిగా రాదు, కానీ అనగా అనగా రాగమతిశయించు, తినగా తినగా వేము తియ్యనౌను.
జై హింద్
శరభయ్య పోలకం

Good Idea Sir
ReplyDelete