మగధీర, సినిమా ఎన్ని సార్లు చూసానో. ఒక చిన్న విషయం నన్ను బాగా గాబరా పెట్టింది. షేర్ఖాన్ ఒక పెద్ద కత్తితో ఒక పెద్ద సైన్యం తో చిన్న పెద్ద రాజ్యాలన్నిటిని జయిస్తుంటాడు. గెలిచేవాడికి బాగానే వుంటుంది. కాని ఆ గెలుపు కోసం ఎంత మంది ప్రాణాలు ఆవిరి అని తలుచుకొంటే వళ్ళు గగుర్పొడుస్తుంది. ఓడిన ఆ రాజ్యం, నివాసం ఉంటున్న ప్రజలు అన్ని మరల యధాస్థితికి రావాలంటే ఎంత సమయం తీసుకుంటుందో చెప్పలేని స్థితి.
ఒక్కడి కోసం ఇందరి బలి పాపం ఆ రోజుల్లో ప్రజలు ఇది ఎలా భరించారు అని భాధ, అమ్మో ఒకవేల ఇలాంటివి ఇప్పుడు జరిగితే ఎలా అని భయం వేసింది. కొన్ని రాజ్యాలు ఏకంగా కుర్ర్రకారుని కోల్పోయి క్రమీణ అంతరించి అన్నది చారిత్మాతక నిష్టూర సత్యం. ఆ రోజుల్లో ఒక బలాడ్యుడు సాగించిన వికృత క్రీడకి నిలువెత్తు నిదర్శనాలు ఇవన్నీ. కాని ప్రజలు బలవంతులయ్యారు.
అన్యాయాన్ని నిదేసే రోజులు వచ్చాయి కాని దానితో పాటే బలాడ్యుల స్ట్రాటజీ కూడా మారింది అనిపుస్తుంది మన చిన్నగంజాంలో రాజకేయ క్రీడ కి బలయ్యిన యూత్ ని సూస్తుంటే. తెలియకుండానే మన పిల్లల్ని మనమే చెడు త్రోవలో కి సాగానంపుతున్నమా? ఒక్క క్షణం ఆగి అడుగుదామని పించింది. ప్రతి ఎలక్షన్ కి ఎంతమంది చిన్నారులు త్రాగుబాతులుగా మారి బవిష్యత్తుని పోగొట్టుకొంతున్నారో లెక్క చూపించాలి అనిపించింది.

మామ, కొందరి పిల్లలు కి బంగారు బవిశ్యత్తు మరి కొందరికి ఈ మద్యపాన దుస్థితి ఎవరి వలన? సూటిగా వచ్చిన యూత్ లీడర్ రాఘవయ్య ప్రశ్నకి సమాధానం మౌనమే అయ్యింది. మా పిల్లలు మద్యానికి బానిసలై మాట వినడము లేదు. చివరకి బెదిరింపులకి కూడా వెనకాడటం లేదు, ఇప్పు మేము ఏమి చెయ్యాలి శరభయ్య అని కన్నీరు మున్నేరు అవుతున్న తల్లిదండ్రుల కి ధైర్యం చెప్పే మాటలకి కరువు. ఇలాగే పోతుంటే మన రేపటి పౌరులు చేవసచ్చి జీవచావాలుగా జీవనం సాగించే దుస్థితి ని చూడగలిగే ధైర్యం చిన్నగంజాంకి వుందా? ప్రశ్న కి మౌనం సమాదానం అని థెలుసు. కాని అర్ధ రాత్రి నిద్రలో కూడా ఇవే కనిపిస్తుంటే నిద్ర ఎలా?
షేర్ఖాన్ యుద్ధానికి, మన రాజకీయ క్రీడకి వ్యత్యాసం కనిపించలేదు. అక్కడ ఒక్క వేటుకి ఇక్కడ ఒక్క వ్యసనానికి. వేటు ఎంతో నయం. క్షణాలలో ప్రాణం పోతుంది. వ్యసనం తో ప్రాణం వున్నా లేనట్లే. ఎంత నరకం.
అసలు ఎలక్షన్ లో గ్రామస్తులకి ఏమైనా లాభం వుందా. కాంటెస్ట్ చేస్తున్న వాళ్ళ మంచి చెడుల ని ప్రజలకి చెప్పటం లో వుండాలిసిన శ్రద్ధ ప్రలోభాలకి లోబరుచుకోవడం లో పెట్టడము వలన ఈ దుస్థితి వచ్చింది అనిపిస్తుంది. సోషల్ మీడియా రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ప్రలోభాలకి లొబరుచుకోవాలి అన్న ఆలోచనే మంచిది కాదు అనిపించింది...
చివరకి ఎలక్షన్స్ తరువాతచిన్నగంజాం కి మిగిలింది ఏమిటి?
1) ఒక MLA : మనము పిల్లలకి మద్యం వ్యసనం అలవాటు చేసినా, చేయకపోయినా ఒక లీడర్ ఎన్నుకోబడతాడు. అది మన ప్రజాస్వామ్యం. ఎన్నికైన వ్యక్తి ప్రజలకోసం పని చేస్తాడు. లేకపోతే మల్లి ఎలక్షన్స్ ఎలాగు వున్నాయి. ఇక మన పార్టీ వాడు ఎలా గెలుస్తాడు అంటారా? అసలు మంచి అనేది మన పార్టీ కావలి గాని, పలానా పార్టీ నా పార్టీ అని చెప్పగలమా. ఆ పార్టీ తరుపున ఎలక్షన్ లో నిలబడే వాడు మంచివాడు కాకపోయినా సపోర్ట్ చేస్తామా. అల్లా అయితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. కొంతమంది బలమైన వాళ్ళ సిండికేట్ అవుతుంది.
2) చోటా నాయకులు: వాళ్ళ వాళ్ళ చిన్నిపాటి పనులకోసం MLA కి పరిచయం అవ్వడానికి వాళ్ళ తాపత్రయం. నిజానికి ఊరంతా ఒక తాటి పైన వుంటే గెలిచిన MLA కి మన గ్రామం బలం వలన అతని గెలుపు తెలుసుకొని ఉంటాడు. ఒక మంచి సన్మానం లో ఈ చిన్న నాయకులు పరిచయం అవ్వచ్చు. దానికోసం ఊరి యువతని మద్యానికి బానిసలు చేసి MLA ధృ ష్టి లో పడాలా? ఒక్కసారి ఆలోచించండి.
3) మద్యానికి బానిసలైన యువత: ఎలక్షన్ టైం లో ఎవరో ఇచ్చే మద్యానికి, బిర్యానిలకి బలై జీవితాన్ని వ్యసనాలకి అప్పచెప్పి, కన్నవారిని కట్టుకోన్నవారిని బాధపెడుతూ బలైపోతున్న కుర్రకారు. ఒక చిన్న పొరపాటు వలన జీవితం ఎంత చిన్నబిన్నం అవుతుందో ఒక్క సారి తలుసుకొంటే మల్లి ఇంకొక సారి ఆ పని చెయ్యరేమో.
ఇప్పటికి బలైన యువతని మళ్ళి భావి మంచి పౌరులుగా ఎలా చెయ్యడం? చెడపడం ఒక్క క్షణం. దానిని బాగు చెయ్యడం వసంతాల పని. 23 ఇయర్స్ లోపు పిల్లలని మద్యం మాన్పించే ఫౌండేషన్ ఏదైనా వుంటే బాగుండు. దానికిచిన్నగంజాం సలాం చేస్తుంది.
జై హింద్
శరభయ్య పోలకం
Comments
Post a Comment