
ఉదాహరణకి, మన రాజధానిని ఆనుకొని వున్న ఇబ్రహీంపట్నం థెర్మల పవర్ ప్లాంట్ ప్రపంచము లోనే గొప్ప పొల్యూషన్ లేని పవర్ ప్లాంట్. ఇప్పుడు వున్న టెక్నాలజీతో మనము బాధ్యతా యుతముగా పవర్ ప్లాంట్ కట్టుకోవచ్చు.
ప్రైవేట్ పవర్ ప్లాంట్లు వాళ్ళు అయితే బాధ్యతారాహిత్యము తో వ్యవహరిస్తారుగాని, ప్రభుత్వరంగ సంస్థ ఐన జెన్ కో మంచిగా చేస్తుంది అన్నది నా అభిప్రాయం.
ప్రజలు తమకు ఏది మంచిదో అది తెలుసుకొని దానినే కోరుకోవడము చాలా అవసరము. ఇవ్వాళ రేపు, ప్రతి పనికి రాళ్లు వేసే వాళ్ళు వుంటారు. ఫైనల్ గా, మనకు మన భావి తరాలవాళ్ళకు ఏది మంచిదో అది చేస్తే మంచిదేమో.
మన ప్రాంతానికి ప్రాజెక్ట్ లు ఏమి లేవు. ఇప్పుడు వస్తుంటే అడ్డు పడవద్దు . ఏవిధముగా ఉంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆలా చెయ్యమని డిమాండ్ చెయ్యడము మాత్రం మరవ వద్దు .
మీకు త్రినాధ్రెడ్డి గారు మార్గదర్శకులు గా ఉండగలరని ఆశిస్తున్నాను.
Comments
Post a Comment