Skip to main content

విఠల్! సార్ పోయి, చీటింగ్! సార్ వచ్చారు!!!

శరభయ్య! ఎంతకాలం అయ్యిందిరా నిన్ను చూసి, నవ్వుతూ విఠల్ మాస్టారు గారు. నువ్వు అస్సలు మారలేదు రా. అమెరికా లో సెటిల్ అయ్యావు కదా కొంచెం మారి ఉంటావు అనుకొన్నాను నవ్వుతూ అన్నారు మాస్టారు గారు. దాదాపు 30 సంవత్సరముల తరువాత చూస్తున్నాను విఠల్ సార్ ని.

నమస్తే సార్! అవును సార్ మిమ్మల్ని చూసి చాలాకాలం అయ్యింది అన్నాను. తన ఆప్యాయతలో ఏమాత్రం తగ్గని ప్రేమని చూసి మన జనరేషన్ లో ఇలాంటివాళ్ళు కరువేకదా అనిపించింది.

ఇక్కడ విఠల్ సార్ గురించి రెండు మాటలు చెప్పాలి. తను మా చిన్నప్పుడు హైస్కూల్ లో టీచర్ గా  చేసే వారు. కాళీ సమయాలలో చిన్నపాటి పత్రికని నడిపేవారు. అంతేకాదు, పోలీస్ స్టేషన్ లో ఒక గంట పాటు కూర్చొని పోలీసులతో పిచ్చాపాటి మాట్లాడేవారు. నాకు అర్ధం అయ్యేది కాదు, తనకు రోజూ పోలీసులతో పని ఏమి ఉంటుందో.

ఒక సారి అడిగాను. సార్ మీకు తెలియని ఇన్స్పెక్టర్ లేడా? నవ్వుతూ విఠల్ సార్ అన్నారు. శరభయ్య, మనము ఊరిలో ఉంటాము, ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో తెలుస్తుంది. మరి కొత్తగా వచ్చే ఇనస్పెక్టర్ కి ఎలా తెలుస్తుంది? అందుకని నేను వాలంటీర్ గా పరిచయము పెంచుకొని వారికి ఊరిలో స్థితిగతులని తెలిపి వారి డ్యూటీ వారు సక్రమముగా నిర్వర్తించడానికి నా వంతు సహాయం నేను చేస్తాను. నిస్వార్ధ సేవకి నిలువెత్తు రూపం మా మాస్టారు. నాకు ఒక్క క్షణం గర్వము తో చాతి పొంగింది.

మొన్న సీఐ శ్రీనుని అడిగాను. మరి వినుకొండలో ఇలాంటి సార్లు నీకు హెల్ప్ చేస్తున్నారా అని. శ్రీను నవ్వి అన్నాడు. మామ నువ్వు మరీ సత్తె కాలంలో వున్నావు. ఇప్పుడు విఠల్ సార్ లాంటి వారు పోయారు. ఇప్పుడు చీటింగ్ సార్లు వచ్చారు. ప్రజలు ఒక సమస్య ని మా ముందుకు తెస్తే, దానిని సాల్వ్ చేసే లోపే చీటింగ్ సార్ వచ్చి, నేను పాలనా MLA మనిషిని, మీ ముందు వున్న సమస్యని పట్టించుకోవద్దు అని వార్నింగ్ ఇస్తారు. కొంత కాలం ఆలా నానాక, మన చీటింగ్ సార్ ప్రజల దగ్గరకి వెళ్లి, మరి ఇనస్పెక్టర్ కి కొంచెం చెయ్యి తడిపితే మన పని అవుతుంది అనిచెప్తాడు. ప్రజల దగ్గరనుండి వసూల్ చేసిన డబ్బుని చీటింగ్ సార్ స్వాహా చేస్తాడు. మరి విఠల్ మాస్టార్ లాంటి వారికి స్థానం లేదు కదా?

ఇదే తంతు మండల రెవిన్యూ ఆఫీస్ లో కూడా జరగడము పరిపాటి అయ్యింది. మరి ప్రతి MRO ఒక బినామీ ని పెట్టుకొని లంచావతారులవుతుంటే జనాలు ఏమి చేస్తున్నట్లు? చిన్నప్పుడు వేసిన "మంచులో రేగిన మంటలు" నాటికలో డైలాగ్ గుర్తుకొస్తుంది. "రోజులు మారాయి రంగన్న!!".  గంట రావు బావ!,  నీకు గుర్తు వుందా ఈ డైలాగ్? నువ్వు ఆ నాటిక డైరెక్టర్ వి ఆరోజుల్లో...

మన వూరిలో అలాంటి చీటింగ్ సార్లు  ఇద్దరు ఉన్నారంట. వారిలో మార్పు కోసం మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆశాభంగం చెయ్యరని ఆశిద్దాము...

జై హింద్,
శరభయ్య పోలకం


    

Comments

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం   
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం