ఇన్నేళ్ళుగా గ్రామ సీమలను మభ్యపెట్టి, మనోభావాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొన్న
రాజకీయం ఇప్పుడు మీడియా సాక్షిగా అబద్దాలను ప్రచారం చేస్తూ కొత్త పుంతలు తొక్కుతుంది. ఏది నిజం, ఏది అబద్దం అనేది సగటు జీవికి ఒక కొరకరాని కొయ్య అయ్యింది ఈనాడు.
అసలు ప్రజలకి ఏమి కావాలి అన్న విషయము మీద దృష్టిపెట్టే నాయకుడు ఎక్కడ? ఎలా మోసం చేసి నిట్టనిలువునా సమాజాన్ని చీల్చి, మన వాటా ఓట్లు ఎలా రాబట్టాలి అన్న యావ మీద వున్న దృష్టి ప్రజలకి నిస్వార్థమైన సేవ చేసే విషయాల మీద పెడితే జనం మెచ్చిన నాయకుడు అవుతాడు అన్నది అక్షర సత్యం.
గత 40 సంసారములు గా నేను చిన్నగంజాం మండలము లో చూస్తున్నాను. నా కంటే ముందు పుట్టి ఇంకా జన జీవన స్రవంతి లో యాక్టీవ్ గా వున్నా పెద్దలు చూస్తున్నారు. వచ్చిన ప్రభుత్వాలు చేసిన మంచి ఏమి లేదు అన్నది చిన్నగంజాం ప్రజలు ఎరిగిన సత్యం. ఒక ప్రాజెక్ట్ లేదు. ఒక ఫ్యాక్టరీ లేదు. కొన్ని గ్రామాలలో కనీసం రోడ్లు , రవాణాసౌకర్యం, కరెంటు, త్రాగునీరు సౌకర్యాలు కూడా లేవు.
పబ్బం గడుపుకునే రాకీయం, స్వార్థపరులైన కొంత మంది స్థానికులని లోబరుచుకుని లబ్ది పొందుతున్నారు. ప్రజలు చైతన్యము తెచ్చుకొని గ్రామానికి ఏమి కావాలి అన్న విషయము మీద దృష్ఠి పెడితే మన గ్రామసీమల్లో ఆనందం మరలా వెల్లి విరుస్తుంది. గల్లీ నాయకులు కూడా స్వలాభం మానుకొని గ్రామం కోసం పాటుపడితే ముందు తరాలవారు ఫలాలు అందుకొంటారు.
-జై హింద్
శరభయ్య పోలకం

Comments
Post a Comment