Skip to main content

Posts

Showing posts from April, 2017
నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి చిన్నగంజాం మార్కెట్ లో చాపలు, రొయ్యలు మరియు కొన్ని ఆకు కూరలు ఎప్పుడు తూకం వేసి అమ్మ లేదు ఎవ్వరును. అలా ఎందుకు చేయ్యరో ఒక్కసారి ఆలోచిద్దాము. 1) మత్స్యకారులు మరియు ఇతరులు ఎంతో శ్రమకోడ్చి వేట లో పడిన సరుకు మార్కెట్ కి తెస్తారు. అక్కడ వెంటనే చిన్నపాటి చిల్లర వ్యాపారులకు అమ్ముతారు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ వేటగాళ్లు మరియు చిన్నవ్యాపారులు ఒకే కుటుంబం లాగా అన్నమాట. అంతా చిన్నగంజాం వాళ్లే  కాబట్టి ఒకరిని ఒకరు అంతగా మోసం చేసునేది ఉండదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అండ్ జగమెరిగిన సత్యం. 2) చిరు వ్యాపారులు పచ్చి సరుకు పాడై పోయే లోపులోనే అమ్మగలగాలి. ఇది చాలా స్కిల్ తో కూడు కున్న వ్యవహారం. సరుకు బాగా వున్నప్పుడు అంటే ఫ్రెష్ గా మరియు పెద్దవి అయితే రేట్ ఎక్కువకి లేకపోతే  తక్కువకి  ఇవ్వాలి. లేక పోతే సరుకు మిగిలి పోయి చిరు వ్యాపారి నష్ట పోతాడు.  ఇక్కడ చిరు వ్యాపారి అంటే రోజు వారి కూలీలే. కష్టం చేసే ఓపిక లేక పాపం ఇంత రిస్క్ చేస్తారు. 3) ఇక్కడ వినియోగదారులు కూడా రెగ్యులర్ కస్టమర్స్. చిరు వ్యాపారులకు మరియు కస్టమర్స్ కి ఇక్కడ వున్న సంబంధం...

పని కట్టుకొని పల్లెలను విడదీసింది ఎవరు?

చివరకి చిత్తు కాగితాలు ఏరుకొనే వారికి కూడా సంఘాలు వున్నాయి, కాని మన గ్రామీణ ప్రజలలో సంఘస్ఫూర్తి లోపించింది అన్న కెసిఆర్ మాటలు అక్షర సత్యాలు. పని కట్టుకొని పల్లెలను విడదీసింది ఎవరు అని గట్టిగా ప్రశ్నించాలని వుంది.  సాలి, మంగలి, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, కాపు, రెడ్డి, వైశ్యాస్, అయ్యవార్లు  ఇలా సమాజాన్ని మళ్ళీ  కలవలేని స్థితికి తీసుకొని వెళ్లి ఇప్పుడు అయ్యో రామా ఇలా జరుగుతుంది ఏమిటి అని అనొకొంటే అంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకొకటి ఉండదేమో.  ప్రతి ఆరు నెలలకి వచ్చే ఏదో ఒక ఎన్నికలలో గెలుపు కోసం రాజకీయనాయకులు ఆడే ఈ రాక్షస క్రీడలో అన్యాయముగా బలి అయ్యేది గ్రామీణులే. పట్టణవాసులు ఎన్నికల రోజుని ఒక సెలవు రోజుగా ఎంజాయ్ చెయ్యటం తప్ప ఇంకా పెద్దగా పట్టించు కొని ఈ రోజులలో అడ్డంగా బలి అవుతుంది మాత్రం పాపం గ్రామీణ ప్రజానీకమే. కులం పేరుతో జనాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని గెలిచిన తరువాత మొఖం చాటువేసే నాయకుడికి తెలియకపోవచ్చు మన గ్రామాలలో ప్రజలు ఈ కులాల కొలిమిలో ఎంత కాలి పోతున్నారో. పచ్చి రక్తం త్రాగే రాక్షసులకు ఇలాంటి రాజకీయ నాయకులకి తేడా ఏమిటి? మరి ఈ క్రీడ కి మనం బ...

చిన్నగంజాం మండలం ప్రజలు చేసిన పాపం ఏమిటి?

మన చిన్నగంజాం మండలం అనాదిగా నిర్లక్ష్యానికి గురిఅయిందనేది నిష్ఠూర సత్యం. కుల ప్రాతిపదికన ప్రజలను ముక్కలుగా విడదీసి, ఓట్లు  సంపాదించుకొనే శ్రద్ధ ఆశక్తులు, మండల అభివృద్ధి మీద చూపించక పోవడము చోచనీయం. గ్రామాలలో ఒక విధమైన నిర్జీవ వాతావరణం కనబడుతుంది. స్వీయ నియంత్రణ తో స్వయంగా అభివృద్ధి సాధించడానికి సాయం అందించడము లో కూడా ఎన్నికలలో గెలిచిన నాయకులు ముఖం చాటు వేయడముతో, ప్రజలు విసిగి వేసారి పోయారు. మేము చేసిన పాపం ఏమిటి అని కుములి పోతున్నారు. ఇది అనాది గా మనము చూస్తున్నదే, కాని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? మనల్ని మనం అడగవలసిన ప్రశ్న ఇది. 1) గెలిచిన నాయకులకి కనీస విషయ పరిజ్ఞానం లేక పోవడము. సిస్టం ఎలా పని చేస్తుంది. మన ప్రజలకి న్యాయ పరంగా రావలిసిన ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా సాదించుకోవడము అనేది తెలిసి ఉండాలి. సాధిచడానికి సమయము పెట్టాలి. 2) ఒక వేల రాష్త్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్ట పరిస్థితులలో ఉంటే, సమస్యల పరిష్కారానికి, కేసు బిల్డ్ చేసి మంత్రులకి ప్రెజెంట్ చేసి మన సమశ్యల మీద అనుకూల నిర్ణయం వచ్చే విధముగా చేసే పరిజ్ఞానము కూడా ఉండాలి.  ...
మన చిన్నగంజాం మండల గ్రామాలలో వేసవి దాహార్తిని జయించే బృహత్తు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న ఈ క్రింది గ్రామస్థులకు నా హృదయపూర్వక అభినందనలు. -జై హింద్ శరభయ్య పోలకం 1) అమీన్ నగర్ - రామాలయం 2) రాజుబంగారుపాలెం - జాలమ్మ చెట్టు 3) కుక్కలవారి పాలెం - భ్రంహం గారి గుడి 4) కుక్కలవారి పాలెం - యానాదిసంగం 5) కుక్కలవారి పాలెం - కనకదుర్గమ్మ గుడి 6) చిన్నగంజాం - రైల్వే స్టేషన్ 7) చిన్నగంజాం - మార్కెట్ సెంటర్ 8) చిన్నగంజాం - అంబేద్కర్ సెంటర్ 9) చిన్నగంజాం - కన్యకాపరమేశ్వరి టెంపుల్ 10) చిన్నగంజాం - తాటి సుబ్బారావు గారి ఇల్లు 11) చిన్నగంజాం - రైల్వే గేట్ సెంటెర్ 12) చిన్నగంజాం - మండల కార్యాలయం 13) రామచంద్రానగర్ 14) బాపయ్య నగర్ 15) పెద్ద పల్లెపాలెం - ఎన్టీఆర్ బొమ్మ 16) పెద్ద పల్లెపాలెం - రాములవారిగుడి 17) పడమట పల్లె పాలెం - రచ్చబండ 18) తూర్పు పాలెం 19) మున్నవారిపాలెం 20) చిన్నగంజాం - బండ కాలనీ 21) మూలగానివారి పాలెం 22) కొత్తపాలెం - Dr. ఆనంద్ గారి కొట్టారు 23) కడకుదురు - బస్సు స్టాండ్ 24) కడకుదురు - రామాలయం 25) కడకుదురు - కృష్ణుడి గుడి 26)  కడకుదుర...