శరభయ్య! ఎంతకాలం అయ్యిందిరా నిన్ను చూసి, నవ్వుతూ విఠల్ మాస్టారు గారు. నువ్వు అస్సలు మారలేదు రా. అమెరికా లో సెటిల్ అయ్యావు కదా కొంచెం మారి ఉంటావు అనుకొన్నాను నవ్వుతూ అన్నారు మాస్టారు గారు. దాదాపు 30 సంవత్సరముల తరువాత చూస్తున్నాను విఠల్ సార్ ని. నమస్తే సార్! అవును సార్ మిమ్మల్ని చూసి చాలాకాలం అయ్యింది అన్నాను. తన ఆప్యాయతలో ఏమాత్రం తగ్గని ప్రేమని చూసి మన జనరేషన్ లో ఇలాంటివాళ్ళు కరువేకదా అనిపించింది. ఇక్కడ విఠల్ సార్ గురించి రెండు మాటలు చెప్పాలి. తను మా చిన్నప్పుడు హైస్కూల్ లో టీచర్ గా చేసే వారు. కాళీ సమయాలలో చిన్నపాటి పత్రికని నడిపేవారు. అంతేకాదు, పోలీస్ స్టేషన్ లో ఒక గంట పాటు కూర్చొని పోలీసులతో పిచ్చాపాటి మాట్లాడేవారు. నాకు అర్ధం అయ్యేది కాదు, తనకు రోజూ పోలీసులతో పని ఏమి ఉంటుందో. ఒక సారి అడిగాను. సార్ మీకు తెలియని ఇన్స్పెక్టర్ లేడా? నవ్వుతూ విఠల్ సార్ అన్నారు. శరభయ్య, మనము ఊరిలో ఉంటాము, ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో తెలుస్తుంది. మరి కొత్తగా వచ్చే ఇనస్పెక్టర్ కి ఎలా తెలుస్తుంది? అందుకని నేను వాలంటీర్ గా పరిచయము పెంచుకొని వారికి ఊరిలో స్థితిగతులని తెలిపి వారి డ్యూటీ వారు...