అరవై చలివేంద్రాలు, అదీ చిన్నగంజాం మండలం మొత్తం. అసలు ఇది సాధ్యమేనా?
అన్ని పాయింట్స్ లో ప్రతిరోజు వాటర్ నింపటానికి టైం సరిపోతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలతో చలివేంద్రాలు ఏర్పాటు చెయ్యడము జరిగింది. ఇప్పుడు ప్రజలు అంతా తామై చలివేంద్రాలని నడుపుతున్న వైనం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది.
చిన్న ఇన్సిడెంట్... ఈరోజు చిన్నగంజాం రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి నుండి ఫోన్ వచ్చింది వెంకటేశ్వర రావుకి. వాటర్ సప్లై బాగుంది కానీ ట్రైన్స్ లో వచ్చిన ప్రయాణికులు ఎండలకు దాహంతో చలివేంద్రంలో చల్లటి నీళ్లు త్రాగుతున్నారు. మధ్యాహ్నం సమయానికి కుండలలో నీరు నిండుకుంటుంది. రోజుకి రెండు సార్లు నింపితే ఉపయోగంగా ఉంటుంది. ఇది రిక్వెస్ట్. రోజుకి రెండు సార్లు మండలం మొత్తం వాటర్ కుండలలో నింపటం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. వెంటనే వెంకటేశ్వర రావు కి ఒక ఐడియా వచ్చింది. రోజు ఉదయం కుండలలో నీరు నింపే సమయము లోనే ఇంకొక 3 క్యాన్లు ఎక్సట్రా ఇచ్చి పాయింట్లో వున్న వాలంటీర్స్ కి అప్పగించడము. కుండలలో నీరు అయిపోయిన తరువాత, ఈ క్యాన్లలో వున్న నీటిని కుండలలో కి ఈ వాలంటీర్స్ నింపుతారు.
అద్భుతం, ప్రాబ్లెమ్ పరిష్కరించబడింది. ప్రజలు స్వచ్చందము ముందుకు వచ్చి వేసవికాలాన్ని ఇలా జయించడము ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. ఈవిదంగా ప్రతి పల్లె పోటీ పడి మరీ ప్రజల దాహార్తిని తీర్చడము ఒక శుభపరిణామము. చిన్నగంజాం హద్దులు లేని వసుధైక కుటుంబము కావడానికి ఇంకా ఎంతో సమయము పట్టదు అని నా నిశ్చితాభిప్రాయం.
సప్త సముద్రాల ఆవల వున్నా, నా జనులకి ఈ చిన్ని పాటి ఉడతా సాయం అందిచే శక్తి ని నాకు ఇచ్చినందుకు ఆ భగవంతునికి నేను సదా సేవకుడినై వుంటాను.
జై హింద్
శరభయ్య పోలకం
Comments
Post a Comment