Skip to main content

Posts

Showing posts from March, 2017

వేసవికాలం దాహం కాలం. రండి జయిద్దాం!!!

చిన్నగంజాం మండల్ పరిధి లోని గ్రామాలలో వేసవి చలివేంద్రం ఏర్పాటు చేయాలి అని భావించే సామజిక కార్యకర్తలుకు ఓక శుభవార్త. మీరు చలివేంద్రం ఏర్పాటు చెయ్యడానికి కావలసిన సామాగ్రిని అందచడానికి చిన్నగంజాం గ్రామ ప్రజలు కలసి నిర్మించిన సుజల స్రవంతి నిర్వాహకులు చేయూతనిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం మరియు మధ్యాహ్నం శుద్ధ త్రాగునీరు టాంకర్ తో  మీ చలివేంద్రం లో  మట్టి కుండలలో నీరు నింపటానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఔత్సహికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని దాహార్తులకు హాహం తీర్చమని ప్రార్ధన.  జై హింద్  శరభయ్య పోలకం       

Media Literacy

పత్రికలలో వచ్చే వార్తలు ముఖ్యముగా ఈ క్రింద విధముగా రాస్తారు. 1) వార్త ఎందుకు, ఎలా మరియు  ఏ పర్పస్ కోసం రాయాలి.  2) వార్తని వ్యక్తులు ఎలా అర్ధం చేసుకొంటారు? సామాజిక సాంప్రదాయాలు వార్తని ఎలా ప్రభావితం చేస్తాయి? వ్యకి నమ్మకాలని మరియు ప్రవర్తనని ఎలా మారుస్తాయి అనే స్పృహ ఉండేలా వుందా? 3) వార్త మన చుట్టూ  వున్న ధర్మ బద్దమైన మరియు న్యాయ బద్దమైన ఇష్యూ మీద ప్రాధమిక విషయం జ్ఞానాన్ని అందించేలా వుందా?   ఇలా రూపుదిద్దుకున్న క్వాలిటీ వార్తలతో మనకు స్వతంత్రం వచ్చింది, అనేక దేశాలలో ప్రజలు తమకు నచ్చిన రాజ్యాలను సాధించుకొన్నారు. చివరకి అమెరికా అధ్యక్షుడికి కూడా దడ పుట్టించే నిబద్దత సొంతమని చాటించింది మీడియా.  కానీ ఇలాంటి నిర్మొహమాటమైన వార్తలు రాయడానికి ఉన్నత చదువులతో పాటు సంస్కారం, దేశసేవ, సామాజిక స్పృహ లాంటివి విలేఖరికి లేదా రిపోర్టర్స్ కి తప్పకుండ ఉండాలి. మరి మన చుట్టూ తిరుగుతున్న విలేకర్లకు ఇలాంటివి ఉన్నాయా? ఏ చదువు అబ్బని మరియు ఏ ఉద్యోగం రాని, ఎందుకు కొరగాని వారు విలేకరి అవతారమెత్తితే ఏమై పోవాలి మన సమాజం? అసలు ఇన్ని మాస్ కమ్యూనికేషన్...

మీసేవ ప్రభుత్వం ప్రజలకి కల్పించిన సర్వీస్ కాదా?

చిన్నోడా ఆ కరెంటు బిల్ కలెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు పొలం వెళ్ళాను, కరెంటు బిల్ కట్టలేదు. కొంచెం కరెంటు ఆఫీస్ కి వెళ్లి బిల్ కట్టిరా. బిల్ కలెక్టర్ సాయంత్రం వస్తాడు కడతానులే సమాధానం ఇచ్చిన రోజునే బిల్ కట్టి బిల్ కాగితం ఇంట్లో ఇచ్చాను. రాను రాను జనాలు పెరిగారు, కనెక్షన్స్ పెరిగాయి. కానీ బిల్ కలెక్టర్లు ని పెంచడం ప్రభుత్వానికి తలకి మించిన పని అయ్యింది.  పనికి ఆహరం పధకాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉద్యోగ కల్పనలో చూపించలేక పోయింది. ఫలితం, మీసేవ...  ఇలాంటి సేవలన్నీ, ప్రభుత్వం చేయడానికి ఉద్యోగులు అవసరం, కానీ మన ప్రభుత్వాలు అక్కడ పొదుపు సూత్రం గట్టిగా పాటించి మీసేవ అనే ప్రైవేట్ / పొరుగు సేవల కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ అక్కడే పొరుగు సేవల నిర్వాహకుల విషయము లో మంచి సుద్ధ పప్పులో కాలు వేసింది.   మీసేవ నిర్వాహకులు సేవని వ్యాపారం చేయడానికి ఎన్నో ఎక్కువ రోజులు తీసుకోలేదు. Rs. 10/- తీసుకోవలసిన అప్లికేషన్ కి షుమారుగా Rs. 300/- ఛార్జ్ చెయ్యడము, అది ఒక కస్టమరీ గా మారి పోవడము జరిగిపోయింది. మరి ఆకలితో వున్నవాడిని అరిశలకి కాపలా పెట్టి అరిసెలు తినవద్దు అంటే ఎలా? కాన...