Skip to main content

Posts

Showing posts from August, 2020

ఆత్మ నిర్భర భారత్ కి, నేను సైతం

మనకు వచ్చే అనేక వ్యాధులకు కారణం మన జీర్ణ వ్యవస్థ అని మీకు తెలుసా? జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచడం మన చేతుల్లోనే వుంది. మన ఇంటిలోనే లాక్టోబాసిల్లస్ (పునీళ్లు) తయారు చేసుకోవచ్చు. మన తాతలు తండ్రులు చేసినదే. నేను పాటించిన తయారీ విధానం: 1) బియ్యం కడిగిన నీళ్లు ఒక గిద్ద తీసుకొని ఒక నైట్ కిచెన్ టాప్ మీద పెట్టండి. 2) రెండు లీటర్ల పాలు ఒక సీసా లో తీసుకొని, దానిలో బియ్యం నీళ్లు కలపండి. 3) మూడు రోజుల తరువాత పైన తేలిన మీగడ వడగట్టి, వచ్చిన నీళ్ళని స్టోర్ చేసుకొని, భోజనానికి ముందు ఒక అర గ్లాస్ తీసుకోండి. 4) మీకు హుషారుగా అనిపిస్తే మీ చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యండి. జై హింద్ శరభయ్య పోలకం      

మళ్ళీ తిరిగి విశ్వాసాన్ని కోరమంటాన్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనిలో అతిశయోక్తి ఏముంది?

క్రిష్ణా, గుంటూరు జిల్లాల ప్రజా ప్రతినిధులు రాజానామా చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చెయ్యడంలో నాకు తప్పు ఏమి కనబడటం లేదు. ఆ రోజు అన్ని పార్టీలు కలసి ఏకాభిప్రాయంతో అమరావతిని  రాజధానిగా నిర్ణయించినప్పుడు, ఆ రెండు జిల్లాల రైతులు సంతోషముగా వారి పొలాలను డెవలప్మెంట్ కోసం ప్రభుత్వానికి త్యాగం చేశారు. ఆ తరువాత చంద్రబాబు కేంద్రంతో గొడవపడి డెవలప్మెంట్ ని ప్రక్కకు పెట్టి ప్రజల ఆస్తులను దోచుకోవడం మీద ద్రుష్టి పెట్టడంతో ప్రజల విశ్వాసాన్ని కోలుపోయారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రజలు జగన్ కి ప్రభుత్వ పగ్గాలు అందిస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అని ఆశించి వైసీపీ కి ఓట్లు వేసి వారి అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యులు అయ్యారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేయకపోగా, అసలుకే మోసం తెస్తే మరి సొల్యూషన్ ఏమిటి? మళ్ళీ తిరిగి విశ్వాసాన్ని కోరమంటాన్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనిలో అతిశయోక్తి ఏముంది? రాజీనామాలు చేసి మల్లి ఎన్నికలకి వెళ్ళండి. మూడు రాజధానుల అంశం మీదనే ఓట్లు అడగండి. గెలిస్తే మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యండి, లేకపోతే యధాస్థితి కొనసాగించండి. రాజానామాలు చెయ్యడం...