Skip to main content

Posts

Showing posts from April, 2020
ఒక తరము గతిలేక అమెరికా కి తరలి వెలసి వెళ్ళింది. ఇప్పుడు పాలకులు పని కట్టుకొని ఇంగ్లీష్ నేర్పించి ఇంకొక తరాన్ని బానిసలుగా చేసి అమెరికాకి పంపించాలని చట్టాలు చేస్తున్నారు. ఆనాడు రాజధాని కోసం తూతూ మంత్రం ప్రజాభిప్రాయానికి, ఇప్పటి ఇంగ్లీష్ మీడియం ప్రజాభిప్రాయానికి తేడా ఏమి వుంది. ఇలాంటి బయాస్డ్ ప్రజాభిప్రాయం ప్రజలకి మేలు చెయ్యడానికేనా లేక ప్రభువులు అనుకొన్నది ప్రజల మీద రుద్దడానికా? టీడీపీ Vs వైసీపీ,   జన్మభూమి కమిటీ  Vs గ్రామీణ సచివాలయం, రాజధాని కోసం ప్రజాభిప్రాయానికి Vs ఇంగ్లీష్ కోసం ప్రజాభిప్రాయానికి మీకు తేడా ఏమైనా తెలుస్తుందా? దొందు దొందేన ?   జైహింద్ శరభయ్య పోలకం 

వలస కార్మికులు, మనం తల వంచుకోవాల్సిన విషయం కాదా?

వలస కార్మికులు దేశంలో ఇంకా వున్నారు అంటే, అది మనం సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం కాదా? భారత్ వెలిగి పోతుంటే మరి ఈ వలసలు ఏమిటి? కరోనా వలన ఇంత మంది పరాయి పంచన బతుకు ఈడుస్తున్నారనే సత్యం వెలుగు చూసింది. మరి తెలిసి మనం చేస్తున్నది ఏమిటి? నారద పాత్ర పోషిస్తున్న మీడియా ఇలాంటి వాటిని వెలుగు లోకి తెచ్చి, ఇంటెలెక్చవల్స్ తో డిబేట్స్ ఎందుకు పెట్టవు? ఎంత సేపు, నేను నా పార్టీలు పదవిలోకి రావాలి, ప్రభుత్వ సొమ్ముని జుఱ్ఱు కోవాలి అన్న యావ తప్ప, భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరు గౌరవప్రదమైన జీవితం సాగించాలని దానికి కావలసిన ప్లానింగ్ చెయ్యాలని మన నాయకులు అని అనుకొంటున్న వాళ్ళు ఎందుకు అనుకోవడములేదు.  చల్లకొచ్చినమ్మ ఎంతకాలం ముంత దాస్తుంది? మేము బాగానే వున్నాము అని దాగుడుమూతలు ఎంతకాలం? పప్పు బెల్లాలు పంచి నోరు తీపిచేసాములే అని దాటవేత ధోరణితో పాలన సాగించడము ఈనాటి మేటి నాయకులకే చెల్లింది. నేను బాగా లేక పోయినా పర్లేదు, రేపటి తరం కోసం పునాది వేస్తున్నా అని చెప్పిన పుస్తకాలలో చదివిన తాత ఏమిటి అంజనం వేసి చూసినా సెంటర్ లో కనబడటం లేదు? వీరిది ఏ కులం? ఏ మతం? కొంచెం చెబితే మన నాయకుల నుండి మరియు వారి వెనక...