Skip to main content

దుక్కి దున్నడానికి పనికిరాని దున్నపోతుని ఏమి చెయ్యాలి?

చిన్నగంజాం మండలంలో,  సంక్షేమ పధకాలేమో అస్మదీయుల పాలు. ఉద్యోగావకాశాలేమో శూన్యం. కొనఊపిరితో వున్న ఉప్పు పరిశ్రమలోనెమో కూళీ కరువు. రోజు రోజు కి పెరుగుతున్న నిరుద్యోగ యువత పరదేశి వలస పట్టి పచ్చని గ్రామాలు వృద్ధుల ఆశ్రమాలుగా రూపాంతరం చెందుతున్నా దున్నపోతు ఇంకా నిద్రపోతూనే వుంది. దాణా దొరుకుతుంది కదా తిని పడుకొంటుందేమో!!!

తోటి దున్నపోతుల దాణా కూడా ఈ దున్నపోతు తింటుందేమో కారంచేడు మండలం లో అసమ్మతి భగ్గుమంది ఈమధ్య. మా చిన్నగంజాం మండల దున్నపోతులకి ఆరిగ చెత్తే పెద్ద దాణా కదా, ఇంకా తమ సూడిని మేపుతున్నాయి బాగా తిని బలవమని.

వ్యతిరేకత వచ్చి, సాక్షాత్తు కామినేని గారు మంత్రిగా చిన్నగంజాం కి వచ్చినప్పుడు, తమ వందిమాదిగ గణం తప్ప ప్రజలు లేని సభని చూసి కామినేని గారు చిఛీ... అన్నాగానీ దున్నపోతులో చలనం లేదు.

డబ్బా కొట్టుకొనడానికి, చిన్నగంజాం, పెద్దగంజాం లో హడావుడి చెయ్యడానికి వచ్చిన దున్నకి జనసేన సైనికులు సోపిరాలలో చర్నాకోలు ఝళిపించినా పెద్దగా బెదరలేదు. చివరకి ఊరిని వర్గాలు వర్గాలుగా విడగొట్టానికి వేసిన పన్నాగం కూడా బెడిసిగొట్టడంతో, సోషల్ మీడియాలో రంకె వేసింది. పోలీస్ యంత్రంగాన్ని ఉసిగొలిపింది, కానీ ఫలితం శూన్యం.

అసలు దుక్కి దున్నడానికి కదా దున్నపోతుకు దాణా, దుక్కి దున్నడానికి పనికిరాని దున్నపోతుని ఏమి చెయ్యాలి? మెడలో గంటకొట్టి ఊరిమీద వదలాలి అంతేకదా జనులారా?

మరి కొత్త దున్నని ఎన్నుకొనే ముందు మరి దుక్కికి పనికి వచ్చే దున్నానేగా కొనుక్కోవాలి? జరా భద్రం బ్రదర్, ఇంకొక 5 యేండ్లు  మోసపోవద్దు . మంచి గొడ్డు వారుతో చేసిన చర్నాకోలు రెడీ గా పెట్టుకోండి దగ్గర, ఎందుకంటే, ఇప్పడు జన్మభూమి అని,  జన్మభూమి కమిటీ అని అన్నీ దున్నలు గుంపులుగా తిరుగున్నాయంట ఊళ్ళల్లో ఇప్పుడు....

జైహింద్,
శరభయ్య పోలకం

             

Comments

  1. Sir I want to talk with u.sir I also send find request to u.but can't get any reply.pls cal me sir.7729860424.I also from chinnaganjam

    ReplyDelete
  2. I am so interest to start small scale industry.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం   
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం