దోపిడీదారులు సిండికేట్ అయిన ప్రభుత్వానికి కేంద్ర నిధులు ఇవ్వడానికి ప్రజలు మద్దతు లేదేమో? అందుకే ప్రజల నుండి అంత మద్దతు లేదు హోదా ఉద్యమానికి.
రాష్ట్ర స్థాయి నాయకులు మరియు వారి మంచి & చెడ్డలు సామాన్య ప్రజలకి అంతగా తెలియదు. కానీ ఊరిలో ఎవరిని పోషిస్తున్నారో అందరికి తెలుస్తుంది. అంటే లోకల్ లో చెడ్డవారిని చేరతీసే రాష్ట్ర స్థాయి నాయకుల మీద గ్రామ స్థాయి లో వున్న ప్రజలకి మంచి అభిప్రాయం ఉండదు. అది వచ్చే ఎలక్షన్ లో షాక్ తగిలితే గాని సదరు నాయకుడికి అర్ధం కాదు.
మనకు నిధులు ఇస్తే ప్రక్క రాష్ట్ర ప్రజలు ఉద్యమం చేస్తారేమో? ఎందు కంటే, కేంద్ర నిధులు అంటే అవి అన్ని రాష్ట్రాల ఉమ్మడి సొమ్ము. మరి దొంగల పాలు అవ్వడము అవసరమా?
అసలు మనము మంచి నాయకులని ఎన్నుకొనే అవకాశం ఈ విధముగా మోడీ గారు మనకు కల్పిస్తున్నారేమో? మంచి నాయకులు ఉంటే మనకు న్యాయం గా రావలసిన నిధులు మరియు హోదా వస్తాయేమో? ఏమో నాకేటి తెలుసు? ఆ శివయ్య ఏతానుకొంటున్నాడో ఏటో?
జై హింద్,
శరభయ్య పోలకం
Comments
Post a Comment