రొయ్యల చెరువులలో బాటమ్ పనులు చేయించి పంపింగ్కి రెడీ గా వున్న చెరువుల కట్టలని పగల గొట్టుకొని జేసీబీ ని మరియు ట్రాక్టర్లు ని దౌర్జన్యముగా మరియు ఇంఫార్మ్ చెయ్యకుండా తీసుకొని వెళ్లి సొంత పనులు చేసుకోవడము తప్పు మరియు అన్యాయం. దానిని సమర్ధించడము ఇంకా తప్పు. ఇది చిన్నగంజాం గ్రామ మరియు చిన్నగంజాం మండల రక్షణ విషయము. గ్రామానికి బయటి వ్యాపారులు వచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడము పరిపాటి. ఇలాంటి స్వేచ్చకీ ఆటంకము కలిగించడము క్షమిచారాని నేరం. చిన్నగంజాం పోలీస్ వారు చాకచక్యముతో ఈ అన్యాయాన్ని నివారించి మరలా గ్రామములో శాంతిని రిస్టోర్ చేసినందుకు నా అభినందనలు. "సాహా చిన్నగంజాం పోలీస్". చిన్నగంజాం అంటే ఒక స్వేచ్చా విపణి. తరతరాలుగా ఈ మంచి పేరు మన ఆయుధం. మనము పాటించే శాంతి సుస్థిరత వలన మనకు వచ్చిన మంచి అధికారులు కూడా ఎక్కువకాలం మన గ్రామము లోనే ఉండటానికి ఇష్టపడుతారు. చిన్నగంజాం పోలీసు వారికి మరలా మరలా నా ధన్యవాదములు మరియు అభినందనలు. అన్యాయాన్ని సమర్ధించడం అన్యాయం చెయ్యడముకన్నా పెద్ద తప్పు. మనము అన్యాయాన్ని ప్రశ్నించని రోజు అన్యాయాన్ని చ...