Skip to main content

Posts

Showing posts from August, 2017

కాపుల లోన్ లు, వృద్ధుల పింఛన్లు , సర్కార్ ఇండ్లు చివరకి మోడీ మరుగు దొడ్లు కూడా తెల్ల చొక్కాల పాలు...

ఇది తెల్ల చొక్కాల అంతం. కాపుల లోన్ లు, వృద్ధుల పింఛన్లు , సర్కార్ ఇండ్లు చివరకి మోడీ మరుగు దొడ్లు  కూడా తెల్ల చొక్కాల పాలవుతుంటే చూస్తూ ఊరుకోలేక ప్రభుత్వ పధకాలు పేద ప్రజలకి అందించాలి అన్న ఒకే ఒక ధ్యేయం తో మన పోలకం శరభయ్య చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. MRO ఆఫీస్ దగ్గరలో ఒక ఆఫీస్ ఓపెన్ చెయ్యడము జరుగింది. ప్రభుత్వ పధకాల కోసం ధరకాస్తు చేసుకొనే వారికి చేయూత నిస్తుంది. తెల్ల చొక్కాల ఉనికిని ప్రశ్నిస్తుంది. ప్రజల సంపదకు కాపు కాస్తుంది. రండి, చేయిచేయి కలుపుదాం. తెల్ల చొక్కాల అంతు చూద్దాం!!! జై హింద్, శరభయ్య పోలకం

ప్రభత్వ సొమ్ముని స్వాహా చేసిన సత్యం వతులని ఏమి చెయ్యాలని మోటుపల్లి ప్రజలని అడిగినప్పుడు వారి స్పందన చెప్పడానికి మాటలకు కరువు

ఎన్నో సంవత్సరాల మేధో మథనం, ఎందరో కలల స్వప్నం చిన్నగంజాం మండలం ప్రజల ఐఖ్య వేదిక మన ట్రస్ట్. ఇన్ని రోజుల పాద యాత్ర ఎన్నో జవాబు లేని ప్రశ్నలకి సమాధానాలు వెతికింది. ఊరంతా బ్రహ్మ రధం పట్టింది, తెల్లచొక్కాలకి చమటలు పట్టించింది. ఎన్నో బెదిరింపులు, ఫ్లెక్సీల పై ప్రతాపాలు, వెరసి వెగటు పుట్టించే గల్లీ నాయకుల రంగులు, సామాన్యుల పై వారి దాష్టికాలు. ఏమి చెయ్యలేని సామాన్యుల అచేతన స్థితి. నేను తెలుసుకొన్న విషయాలు ఒక్కొక్కటి గా ఫేసుబుక్ సాక్షి గా ప్రజల కి తెలియచేయటం నా విధిగా భావించి ఈ సిరీస్ ని ప్రారంభిస్తున్నాను. మొదటిగా స్వచ్ఛ భారత్ మిషన్ ,  ఎంతో గర్వించదగ్గ ఒక కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రజల క్షేమం మరియు ఆరోగ్యం కోసం పెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం, స్వార్ధ పరుల చేతుల్లో చేవ చచ్చి చతికిల పడటం చూస్తుంటే వ్యవస్థ మీద అసహ్యం వేస్తుంది.  దగ్గర వుండి ప్రజల డబ్బు పరుల పాలు కాకుండా చూడవలసిన ప్రజా ప్రతినిధులు, ప్రజలకి  చెందవలసిన ఈ పధకాన్ని ఒక పధకం ప్రకారం దోచుకుంటుంటే చూస్తూ ఊరుకొంటున్న ప్రభుత్వ యంత్రంగం, మీడియా ల మీద వున్నా కించిత్తు గొరవం కాస్తా గంగ పాలు కాక...