Skip to main content

Posts

Showing posts from July, 2017

మా ఊరిలో రైతులు సంపాదించనంత డబ్బు రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ కూర్చొనే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు...

జీవనోపాధికి రాజకీయాలకి రాకపోతే మరి మా ఊరిలో ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, రైతులు సంపాదించనంత డబ్బు రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ  చెట్టుకింద కూర్చొనే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు,  వాళ్ళకి ఎకరాలు ఎలా వస్తున్నాయి? రాజకీయ నాయకుల వార్తలు రాసే న్యూస్ విలేకర్లకు ఆస్తులు ఎక్కడి నుండి వస్తున్నాయి. న్యూస్ పేపర్ ఓనర్స్ కి డబ్బులు ఎక్కవ వుండి  విలేకర్లకు ఊరకనే లక్షలు, కోట్లు ఇస్తున్నారేమో. ఏమో ఎవరికి  ఎరుక. ఆ శివయ్య ఏమి  అనుకుంటున్నాడో నాకేమి ఎరుక. చంద్రబాబు గారు, మరి జనాలంతా రాజకీయ నాయకులు ఫాలోయర్స్  లేక విలేకర్లు  అయ్యేలోపే ఏదో ఒకటి చెయ్యండి. లేకపోతే పని చేసే వాళ్ళు కరువయి మనము ఇంకొక లోకం నుండి మనుష్యుల్ని దిగుమతి చేసుకోవాలి. జై హింద్ శరభయ్య పోలకం 

తెలియకుండానే మన పిల్లల్ని మనమే చెడు త్రోవలో కి సాగానంపుతున్నమా?

మగధీర, సినిమా ఎన్ని సార్లు చూసానో. ఒక చిన్న విషయం నన్ను బాగా గాబరా పెట్టింది.  షేర్ఖాన్  ఒక పెద్ద కత్తితో ఒక పెద్ద సైన్యం తో చిన్న పెద్ద రాజ్యాలన్నిటిని జయిస్తుంటాడు. గెలిచేవాడికి బాగానే వుంటుంది. కాని ఆ గెలుపు కోసం ఎంత మంది ప్రాణాలు ఆవిరి అని తలుచుకొంటే వళ్ళు గగుర్పొడుస్తుంది. ఓడిన ఆ రాజ్యం, నివాసం ఉంటున్న ప్రజలు అన్ని మరల యధాస్థితికి రావాలంటే ఎంత సమయం తీసుకుంటుందో చెప్పలేని స్థితి.  ఒక్కడి కోసం ఇందరి బలి పాపం ఆ రోజుల్లో ప్రజలు ఇది ఎలా భరించారు అని భాధ, అమ్మో ఒకవేల ఇలాంటివి ఇప్పుడు జరిగితే ఎలా అని భయం వేసింది. కొన్ని రాజ్యాలు ఏకంగా కుర్ర్రకారుని కోల్పోయి క్రమీణ అంతరించి అన్నది చారిత్మాతక నిష్టూర సత్యం. ఆ రోజుల్లో ఒక బలాడ్యుడు సాగించిన వికృత క్రీడకి నిలువెత్తు నిదర్శనాలు ఇవన్నీ. కాని ప్రజలు బలవంతులయ్యారు.  అన్యాయాన్ని నిదేసే రోజులు వచ్చాయి కాని దానితో పాటే బలాడ్యుల స్ట్రాటజీ కూడా మారింది అనిపుస్తుంది మన చిన్నగంజాంలో రాజకేయ క్రీడ కి బలయ్యిన యూత్ ని సూస్తుంటే. తెలియకుండానే మన పిల్లల్ని మనమే చెడు త్రోవలో కి సాగానంపుతున్నమా? ఒక్క క్షణం ఆగి అడుగుదామని పిం...