Skip to main content

Posts

Showing posts from 2021
మెజారిటీ పౌరసమాజం ఆమోదించినదే మంచి అయితే, మరి మా ఉల్చి నాగమల్లి ఎలా బ్రతుకుతాడో. వాడికి బూతులు రావు మరి చిన్నప్పటినుండి కూడా.  సాని గాళ్లకు ఇక తిరుగే లేదు 2024 వరకు. బూతులకు అలవాటు పడటమా లేక మెజారిటీని మైనారిటీ చేయడమా? నిర్ణయం మాత్రం సభ్య సమాజానిదే. మౌనం ఇంత హానికరమా?  జై హింద్, శరభయ్య పోలకం   
 తెల్లచొక్కాల మీద యుద్ధం చేద్దామని బయలుదేరితే మొన్న పచ్చ చొక్కాలు, నిన్న బులుగు చొక్కాలు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించుకొని వచ్చేలోపే బులుగు చొక్కా, పచ్చ చొక్కాని నిలువునా కొని బుసలు కొడుతుంది. సైనికా నీ చివరి శ్వాస వరకు నిలబడు, అంతిమంగా నీతి నిజాయతీలదే గెలుపు అని మరవకు.  జైహింద్, జై జనసేన  శరభయ్య పోలకం   
బీద బిక్కి జనాలని స్వార్ధపరులు అని ముద్ర వేసేముందు,  ఎంతో ఉన్నత చదువులు చదివి, ఇతర దేశాలలో కొలువులు చేసి సంపాదన చేసే మనం చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, మనకు గురువింద గుర్తుకు రాక మానదు. వాళ్ళు కుటుంబపోషణకు అమ్ముడు పోతే, దేనికి పనికి రాని ఒక్క పదవి అనే ట్యాగ్ కోసం ప్రవాసులమైన మనం. కాదంటారా? కాకపోతే మరి ఇన్ని గ్రూప్స్ ఎందుకు వచ్చినట్లు .  మొన్నటి ఎలక్షన్స్లో, NRIs చేసిన డామేజ్ గురించి మనకు తెలియంది కాదుగా. అసలు మనం జనసేనకి  మంచి చేస్తున్నామా? మీకు మరియు మీ కుటుంబములో వాళ్లకి ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదు అంటే మిగిలే NRI గ్రూప్స్ ఎన్ని అందులో మెంబెర్స్ ఎంత మంది? ఒక వేలుతో మనం చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయి.   నిష్కామకర్మ చెయ్యడము మనం నేర్చుకొన్న రోజు, నోటుకి అమ్ముడు పోయేవాళ్ల బరువు బాధ్యతలు గుర్తెరుగుతాము.  మనము చేసే సేవ ఒక స్వార్ధపూరితమైనది అయిన రోజు, అది గొప్ప గొప్ప పరిణామాలకు నాంది పలకకపోవచ్చు అన్నది నగ్న సత్యం. ఇప్పటికైనా తోటి NRIs యొక్క Time, Money & Energies ని మీ  మీ స్వార్ధానికి వాడటం మానండ...

కరోనా సమయం లో ప్రశాంతత కావాలి

గ్రామాలు రాష్ట్రాన్ని కాపాడాలిసిన సమయం వచ్చింది ఇప్పుడు. అధికారం కాపాడుకోవడానికి ఒకరు, మళ్లి అధికారం పొందడానికి మరొకరు, రాష్ట్రాన్ని రావణాకాష్టం చేస్తున్నారు. మనం ఇప్పుడు పార్టీల పరంగా విడిపోకుండా క్రొత్త పోకడకు పోవడం చాలా అవసరం. మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఇదే విధమైన అసహాయత నిన్న ప్రెస్మీట్ లో వ్యక్తపరచడం జరిగింది.  జగన్ గారికి, చంద్రబాబు గారికి నా విన్నపం, మాకు ఈ కరోనా సమయం లో నిచ్చలమైన ప్రశాంతత కావాలి. మీరు మాకు ఏమి సహాయం చెయ్యవలసిన అవసరం లేదు. కొంచెం సమాజానికి దూరం వుండండి చాలు.  మా తిప్పలు మేము పడి మళ్లి  సమాజాన్ని నిలబెట్టుకొంటాము. మీరు రాష్ట్రానికి చేసిన మేలు చాలు, ఇక చాలు.