Skip to main content

Posts

Showing posts from July, 2020

ఇదెక్కడి రాజ్యం? ఇది రామ రాజ్యమా?

ఇదెక్కడి రాజ్యం? ఇది రామ రాజ్యమా? గ్యాస్ లీక్ అయ్యి ప్రజలు ప్రాణాలు పోతే కోటి. మృగాలు ఆడపడుచుల మానాలు చెరిస్తే కోటి. అదేమిటని ప్రశ్నించే వారి నోరు మూయించడానికి పైడ్ ఆర్టిస్టులకి ఇంకొక కోటి. వీటన్నింటిని చూసి ఓట్లు వెయ్యరని పప్పుబెల్లాలకి కోట్లు. మీరు తక్షణ సహాయం కోసం కోట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ మళ్ళీ ఇలాంటి గ్యాస్ లీకులు కాకుండా నివారణ చర్యలు తీసుకోవడం మీ తక్షణ కర్తవ్యం కాదంటారా పాలకులారా? మీరు తక్షణ సహాయం కోసం కోట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ మళ్ళీ ఆడపడుచుల మాన రక్షణ మీ తక్షణ కర్తవ్యం కాదంటారా పాలకులారా? మీరు తక్షణ సహాయం కోసం కోట్లు ఇవ్వండి, తప్పులేదు. కానీ మళ్ళీ సగటు ఓటరుని చిల్లరకి లొంగి పోకుండా నిర్భయంగా ఓటు సక్రమంగా వినియోగించుకొనే లాగా అభివృద్ధి పదంలో నడిపించడం  మీ తక్షణ కర్తవ్యం కాదంటారా పాలకులారా? ప్రజల ధనంతో, ప్రజల కోసం నియమించిన ప్రభుత్వ అధికారులను మీ కార్యకర్తలకు పాదాక్రాంతం చెయ్యడం అరాచకం కదా?  కాదంటారా పాలకులారా? జై హింద్, శరభయ్య పోలకం

పవన్ కళ్యాణ్ గారి చాతుర్మాస దీక్ష

నాలో శివుడు, నాలో బ్రాహ్మ, నాలో విష్ణువు, నాలో కృష్ణ వున్నప్పుడు భూమి, ఆకాశం,  పర్వతం, సముద్రం ఎక్కడ చూసినా భగవదర్శనమ్ కలుగుతున్నప్పుడు ఏందుకు మందిరానికి వెళ్లడం.  ఈ సృష్టి అతని స్వప్నం, ఇక్కడ వున్న ప్రతి వ్యక్తి ఆతని సొంతవాళ్ళే అయినప్పుడు భగవంతుని కృప సాధనకు, ప్రతి వ్యక్తికి ప్రేమను పంచడము కన్నా ఉన్నత మార్గం ఏముంటుంది? నా ప్రతి శ్వాస, లయ ఎదుటి వ్యక్తికి పేమని ఇస్తున్నప్పుడు నేనెందుకు మందిరానికి వెళ్లడం. నాలో భగవంతుడు వున్నాడు. పవన్ కళ్యాణ్ గారి చాతుర్మాస దీక్ష గురించి వినగానే, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన కిస్నా సినిమాలో ఒక పాట గుర్తుకు వచ్చింది. తెలుగులో తర్జుమా చేస్తే బాగుంటుంది అనిపించింది.  నేను పవన్ కళ్యాణ్ గారిని అనుసరించడం గర్వంగా భావిస్తున్నాను. నా మిడిమిడి హిందీ భాషా ప్రావీణ్యం చెయ్యలేని ఈ హిందీ నుండి తెలుగు లోకి తర్జుమాని నాకోసం చేసిన నా భార్యకి మనఃపూర్వక ధన్యవాదములు.   జై హింద్, శరభయ్య పోలకం