చిన్నగంజాం మండలంలో, సంక్షేమ పధకాలేమో అస్మదీయుల పాలు. ఉద్యోగావకాశాలేమో శూన్యం. కొనఊపిరితో వున్న ఉప్పు పరిశ్రమలోనెమో కూళీ కరువు. రోజు రోజు కి పెరుగుతున్న నిరుద్యోగ యువత పరదేశి వలస పట్టి పచ్చని గ్రామాలు వృద్ధుల ఆశ్రమాలుగా రూపాంతరం చెందుతున్నా దున్నపోతు ఇంకా నిద్రపోతూనే వుంది . దాణా దొరుకుతుంది కదా తిని పడుకొంటుందేమో!!! తోటి దున్నపోతుల దాణా కూడా ఈ దున్నపోతు తింటుందేమో కారంచేడు మండలం లో అసమ్మతి భగ్గుమంది ఈమధ్య. మా చిన్నగంజాం మండల దున్నపోతులకి ఆరిగ చెత్తే పెద్ద దాణా కదా, ఇంకా తమ సూడిని మేపుతున్నాయి బాగా తిని బలవమని. వ్యతిరేకత వచ్చి, సాక్షాత్తు కామినేని గారు మంత్రిగా చిన్నగంజాం కి వచ్చినప్పుడు, తమ వందిమాదిగ గణం తప్ప ప్రజలు లేని సభని చూసి కామినేని గారు చిఛీ... అన్నాగానీ దున్నపోతులో చలనం లేదు. డబ్బా కొట్టుకొనడానికి, చిన్నగంజాం, పెద్దగంజాం లో హడావుడి చెయ్యడానికి వచ్చిన దున్నకి జనసేన సైనికులు సోపిరాలలో చర్నాకోలు ఝళిపించినా పెద్దగా బెదరలేదు. చివరకి ఊరిని వర్గాలు వర్గాలుగా విడగొట్టానికి వేసిన పన్నాగం కూడా బెడిసిగొట్టడంతో, సోషల్ మీడియాలో రంకె ...