Skip to main content

Posts

Showing posts from July, 2018

తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాసం సెల్ఫ్ గోల్ కాదా? క్షేత్రస్థాయి కార్యకర్తల ప్రక్షాళన ఇకనైనా జరిగేనా???

ఈ అవిశ్వాసం విషయంలో మనం నేర్చుకొనే విషయాలు కొన్ని ఉన్నాయి. రాత్రి లోక్ సభలో అవిశ్వాసం మీద జరుగుతున్న చర్చను ఆసాంతం చూడటము జరిగింది. చాలా ముచ్చట వేసింది, ఇండియా నాయకుల పరిణితి చెందిన విధానము చూసి. నాకు నచ్చిన విషయాలు. మొత్తం 12 గంటలు అవిరామంగా సభ జరగడం.   విషయం వున్న వక్తలకి సమయం కేటాయింపు మరియు సమయ పాలన.  తమ తమ పాయింట్ క్లియర్ గా,  నిజంగా సుత్తి లేకుండా చెప్పడము. నాయకులు చేసిన హోమ్ వర్క్ చాలా బాగుంది. రాహుల్ గాంధీ గారి ఎటాక్ ని చూసి ఆయనలో ఒక పరిణితి చెందిన నేతను చూసాను. మోడీ గారు మొత్తం షో ని స్టీల్ చేశారు. మొత్తం సమయాన్ని తన ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకి మరియు సభ్యులకి చెప్పడములో విజయం సాధించారు అనుటలో సందేహము లేదు.  మొత్తం మీద స్పీకర్ మేడం గారు హౌస్ ని ఆర్డెర్ లో పెట్టడము లో విజయం సాధించారు.  మరి అసలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన టీడీపీ సాధించినది ఏమిటి? టీడీపీ లో సరిఅయిన మాట్లాడే సభ్యుడు లేడు అని తేటతెల్లం. సెల్ఫ్ గోల్, నో డౌట్...  2014 లో ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడము లేదు అనే మాటే గాని, ఈ నాలుగు సంవత్సరాలలో కేంద్...