నాకు ఎన్నో రోజుల నుండి ఇది ఒక ఒక కొరకరాని కొయ్యగా వుంది. చంద్రబాబు గారు మరియు మోడీ గారు చాలా సీరియస్ గా రోజువారీ పేపర్లో ప్రజలకి తెలియజేసే విషయాలు తెల్లచొక్కాలకి వర్తించవా? చంద్రబాబు (గౌరవ AP సీఎం గారు) ప్రకటన : ప్రజలు బ్రతుకుదెరువు కోసం రాజకీయాలకి రాకూడదు. చంద్రబాబు (గౌరవ AP సీఎం గారు) ప్రకటన : సంక్షేమ పథకాలలో వివక్ష ఉండకూడదు. స్వపక్షానికి మరియు విపక్షానికి అందరికి అందాలి. మరి మా మండలం లో ఇలా ఎందుకు జరగడము లేదు. ఇదేమి అన్యాయం అని అడిగిన సర్పంచిని కొట్టించి అడ్డు వచ్చిన ప్రజలని పోలీసులతో సన్మానాలు చేయిస్తున్న తెల్ల చొక్కాలకి చంద్రబాబు గారి మాటలు ఎందుకు వినబడటము లేదు? చివరికి తెల్లచొక్కాల వలన ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినా అధిష్టానం నోరు మెదపనంతటి బలహీనత ఎక్కడ వుంది? ఏమో నాకేటి తెలుసు, ఆ శివయ్య ఏటనుకొంటున్నాడో ఏటో? ...