మన చిన్నగంజాం గ్రామ ప్రజలు తమకు వున్న ప్రతిభతో ముందుకు పోతే దారి క్లియర్ గా కనిపిస్తుంది అన్నది నా అభిప్రాయం. ఎవరో ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే చివరకి నిరాశ తప్పదు. గ్రామ సీమలకి మరల పూర్వపు వైభవం తేవాలని మంచి తలంపుతో నైపుణ్యాలని నేర్పించే సదుద్దేశం తో మన చిన్నగంజాం మండల గ్రామాలలో యువత ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు. కుట్టు మెషిన్ నైపుణ్యం. ఇది మన పెద్దగంజాం గ్రామములో 50 మంది మహిళా ఔత్సహికులుకు నేర్పించటం జరుగుతుంది. చిత్తశుద్ధి తో ఈ నైపుణ్యం నేర్చుకొంటే ఒకరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడే ఆత్మవిశ్వాసం వస్తుంది అన్నది నా నమ్మకం. ఉత్సహం వున్న సామాజిక కార్యకర్తలు ఉదయ్ --> 950-514-2148 ని సంప్రదించగలరు.