గ్రామాలు రాష్ట్రాన్ని కాపాడాలిసిన సమయం వచ్చింది ఇప్పుడు. అధికారం కాపాడుకోవడానికి ఒకరు, మళ్లి అధికారం పొందడానికి మరొకరు, రాష్ట్రాన్ని రావణాకాష్టం చేస్తున్నారు. మనం ఇప్పుడు పార్టీల పరంగా విడిపోకుండా క్రొత్త పోకడకు పోవడం చాలా అవసరం. మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఇదే విధమైన అసహాయత నిన్న ప్రెస్మీట్ లో వ్యక్తపరచడం జరిగింది. జగన్ గారికి, చంద్రబాబు గారికి నా విన్నపం, మాకు ఈ కరోనా సమయం లో నిచ్చలమైన ప్రశాంతత కావాలి. మీరు మాకు ఏమి సహాయం చెయ్యవలసిన అవసరం లేదు. కొంచెం సమాజానికి దూరం వుండండి చాలు. మా తిప్పలు మేము పడి మళ్లి సమాజాన్ని నిలబెట్టుకొంటాము. మీరు రాష్ట్రానికి చేసిన మేలు చాలు, ఇక చాలు.