వీధిలో మైక్ పెట్టి, త్రాగుబోతులతో బాండ బూతులు తిట్టిస్తే, అది ఎవరి తప్పు? మైక్ పెట్టిన వారిదా? బూత్లు తిట్టిన త్రాగుబోతుదా? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు కరెక్ట్ గా ఇలాగే ప్రశ్నించాడు. జవాబు, సెక్షన్ 230 సవరింపు. ఇకనుండి అభ్యంతరకరమైన లేక దేశ వ్యతిరేకమైన అభిప్రాయాలని పోస్ట్ చేసిన వారు మరియు పబ్లిష్ చేసిన వారు ఇద్దరు న్యాయ పరమైన చర్యలను ఎదుర్కొంటారు. పోస్ట్ పెట్టే వారి అభిప్రాయాలకి మీడియా లేక సోషల్ మీడియా బాధ్యులు కాదు అనే desclaimer ఇక పనిచేయదు. కచ్చితం గా ఇప్పుడు చెయ్యవలసిన చట్టమే ఇది. అదృష్టవశాత్తు ఇది అన్ని సోషల్ మీడియా సంస్థలకి వర్తిస్తుంది. ఇక పెటియం రంగుల పార్టీలకి మరియు వారి వారి మీడియా సంస్థలకి రంగులు పడటం ఖాయం. మనము ఇక నుండి నిరభ్యంతరంగా సకుటుంభసపరివారం గా సోషల్ మీడియా ఓపెన్ చెయ్యొచ్చు, మరియు టీవీ చానెల్స్ చూడవచ్చు. మన ప్రధాని మోడీ గారు కూడా ఇలాంటి పరిస్కారం కొరకు చూస్తున్నారని తెలుసు. పరిస్కారం దొరికినట్లే కదా? జై హింద్, శరభయ్య పోలకం