చిన్నప్పుడు స్కూల్ లో చదివేటప్పుడు, తెల్లదొరల ఆగడాలు చదివి రక్తం మరిగేది. అప్పుడు మన అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపార నిమిత్తం వచ్చిన ఇంగ్లీషోళ్ళు, మనకే రాజులై మనలని ఏలిన వైనం, వారిని మన స్వాతంత్ర్య పోరాటయోధులు ఎదిరించి సాధించిన గాథలు ఈరోజుకి కూడా వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అప్పుడు వారు వచ్చి మనలని పాలించారు. ఇప్పుడేమో మనమే ఇతర దేశాలకి వలస వెళ్లి మనలని పాలించమని వేడుకొంటున్నాము. ఒక తరము గతిలేక అమెరికా కి తరలి వెలసి వెళ్ళింది. ఇప్పుడు పాలకులు పని కట్టుకొని ఇంగ్లీష్ నేర్పించి ఇంకొక తరాన్ని బానిసలుగా చేసి అమెరికాకి పంపించాలని చట్టాలు చేస్తున్నారు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ లాంటి వారు బ్రతికి ఉంటే గుండె పగిలేలా రోదించేవారేమో ... దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల ఆత్మ శాంతించుగాక !!! జై హింద్, శరభయ్య పోలకం