Skip to main content

Posts

Showing posts from December, 2017

సద్విమర్శని స్వీకరించడము కూడా ఒక గొప్ప విషయమే

బలవంతులదే రాజ్యం, అనాదిగా వస్తున్న రాజనీతి ఇది. పూర్వం గెలిచిన రాజు  రాజ్యమేలితే, ఇప్పుడు నోటోళ్ళు రాజ్య మేలుతున్నారు. ఎవరైనా మంచి చేద్దామని వస్తే నోటితో బెదరగొట్టి తరిమేస్తున్నారు. ఇదే స్ట్రాటజీ అన్ని స్థాయిల్లో ఉండటాన్ని గమనించాను. పీఎం, సీఎం, ఎంపీ, ఎంల్ఏ  స్థాయి నుండి గల్లీ లీడర్ వరకు ఇదే తంతు. మరి యధా రాజా తధా ప్రజా కదా? ప్రతిపక్ష నాయకుడు ఒక విమర్శ చేసినప్పుడు, నిజమైన నాయకుడు ఆ విమర్శకి సమాధానం చెప్పి విమర్శని తిప్పి కొట్టవచ్చు, లేదంటే తప్పుని ఒప్పుకొని సరిజేసుకోవచ్చు. సద్విమర్శని స్వీకరించడము కూడా ఒక గొప్ప విషయమే. జైహింద్ శరభయ్య పోలకం