1) చిన్నగంజాం మండల ప్రజలు కరెంటు బిల్ కట్టడానికి ట్రస్ట్ వారు ఆన్ లైన్ సౌకర్యము ఉచితముగా కల్పించుచున్నారు. ప్రజలు చిన్నగంజాం మండల కార్యాలయము ఆవరణయందు గల ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు. 2) చిన్నగంజాం మండలం జీడిచెట్లవారి పాలెంలో వున్న చిన్నారులు మరియు మహిళలు స్వయం ఉపాధికోసం కుట్టు మెషిన్ స్కిల్ నేర్పించడాని ట్రస్ట్ సభ్యులు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఔత్సహికులైన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్సియల్ ఇండిపెండన్స్ సాదించాలని మనఃపూర్వకముగా కోరుకొంటున్నాను. 3) చిన్నగంజాం మండలం కాటమవారి పాలెం సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ మరమత్తులు జరుగుతున్నవి. సామాజిక స్పృహ వున్న సహృదయులు ఈ పనులలో వాలంటీర్ గా పాల్గొని సమాజ సేవకి పునరంకితము కాగలరని ఆశిస్తున్నాను. సమాజ సేవకి అంకితమయిన మనకు ఏ అడ్డంకులు లేకుండా అన్ని విధాలా సాయపడుతున్న మండల ప్రజలకి మరియు మనకు సమాజ సేవాగుణాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి సదా భక్తుడినై ఉంటానని నాకు నేను మరల చెప్పుకుంటున్నాను. జై హింద్ శరభయ్య పోలకం